
రాబోయే పదేళ్లలో జగన్ కి పోటీ ఇచ్చే సరైన నాయకుడు కనబడటం లేదు, ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. కానీ, పవన్ కళ్యాణ్ రానున్న పదేళ్ళలో జనసేన అధికారంలోకి రావడానికి బాగా కసరత్తు చేయాల్సి ఉంది. పార్టీ బలోపేతం అవ్వాలంటే..గ్రౌండ్ లెవల్ క్యాడర్ ను ఏకం చేసి ఒకటిగా నడపాల్సి ఉంది.
అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలు తగ్గించి, పాదయాత్ర ప్రారంభిస్తే, బలమైన పార్టీగా జనసేన ఎదిగే అవకాశం ఉంది. అలాగే జనసైనికులు తొందరపాటు ప్రకటనలు మానితే, ప్రజాదరణ పొందుతారు. అన్నిటి కంటే ముఖ్యంగా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తే వచ్చే పదేళ్ళలో పవన్ గొప్ప నాయకుడిగా జనం గుండెల్లో స్థానం సంపాదించవచ్చు.
అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా కావచ్చు. కాకపోతే, ఒక రాజాకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే.. కుల సమీకరణలు ముఖ్య పాత్ర వహిస్తాయి కాబట్టి, పవన్ ఆ రకంగానూ ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలు వేసుకోవడం ఉత్తమం. పవన్ కళ్యాణ్ నిజంగానే మంచి క్రేజ్ ఉన్న, అశేష ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో.
ఫ్యాన్స్ కి ఎమోషన్స్ తప్ప లాజిక్స్ ఉండవు. పూల దండలు, పాలభిషేకాలు వంటి వాటికే వాళ్ళను పరిమితం చేయకుండా.. రాజకీయంగానూ వారిని పార్టీలోకి తీసుకువస్తే.. ఒక నమ్మకమైన క్యాడర్ జనసేన పార్టీకి శాశ్వతంగా ఉండిపోతుంది.
