Jagan- Pawan Kalyan And Chandrababu: అధికారపార్టీలో అసమ్మతి రగులుతోంది. పార్టీని వీడేందుకు రంగం సిద్ధమవుతోంది. అధికారపార్టీకి షాక్ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రతిపక్షనేత వ్యూహానికి విలవిలలాడక తప్పదని తెలుస్తోంది. వై నాట్ 175 అంటున్న వేళ.. ఉన్న ఎమ్మెల్యేలే జారిపోయే ప్రమాదమున్నట్టు వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు అధికారపార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్షనేతకు టచ్ లో ఉన్నారన్న వార్త ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

ఏపీలో పెను సంచలనం రేగబోతోంది. అధికార వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అవ్వబోతున్నారన్న వార్త తాడేపల్లి సర్కిల్స్ లో నిద్ర లేకుండా చేస్తోంది. వైసీపీకి చెందిన 35 నుంచి 35 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరుతున్నారన్న వార్త ఇప్పుడు వైసీపీలో కలవరాన్ని పుట్టిస్తోంది. అయితే జగన్ కు ఉన్న సమాచారం ప్రకారం 24 మంది ఎమ్మెల్యేలు టీడీపీ అధినేతతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. వీరందరూ అదే నియోజకవర్గం నుంచి టీడీపీ సీటు ఆశిస్తున్నట్టు వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే వైసీపీకి కోలుకోలేని దెబ్బపడనుంది.
ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉంది. ఇంతలోనే వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు సిద్ధమయ్యారు. దీని వెనుక కారణం ఉందనే తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు బొటాబొటి మెజార్టీతో గెలిచారు. అది కూడా జనసేన, టీడీపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల గెలిచారు. అదే జంటగా పోటీచేస్తే గెలిచేవారు కాదు. ఇప్పుడు జనసేన, టీడీపీ పొత్తు నేపథ్యంలో 2024 ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని భావిస్తున్నారు. అదే తరుణంలో వైసీపీ అధికారంలోకి రావడం కూడా సాధ్యం కాదని నమ్ముతున్నారు. దీంతో టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. అందుకే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నట్టే పార్టీలో చేరాలని వైసీపీ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు.

చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను తన ట్రాప్ లో లాగడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. సిట్టింగ్ స్థానంలోనే అభ్యర్థిగా నిలబెడతామని వైసీపీ ఎమ్మెల్యేలకు హామీ ఇస్తున్నారు. ప్రధానంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల పై చంద్రబాబు ఫోకస్ పెంచారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీకి రాయలసీమలో గట్టి దెబ్బ పడింది. వైసీపీకి మెజార్టీ స్థానాలు ఇక్కడి నుంచే వచ్చాయి. దీంతో రాయలసీమలోని వైసీపీ ఎమ్మెల్యేల పై చంద్రబాబు దృష్టి పెట్టారు. చిత్తూరు, అనంతపురం జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు చంద్రబాబుకు టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. నెల్లూరులో ఇప్పటికే ముగ్గరు ఎమ్మెల్యేలు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు.
సొంత పార్టీ ఇంచార్జీలను కాదని , వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకోవడం వెనుక చంద్రబాబు వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. 175 నియోజకవర్గాల్లో గెలుస్తామని జగన్ చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీని వీడితే కచ్చితంగా ప్రజల్లో వైసీపీ గెలుపు పై నమ్మకంపోతుంది. అదే సమయంలో టీడీపీకి మైలేజ్ వస్తుంది. సాధారణంగా గెలిచే పార్టీ వైపే నేతలు జంప్ అవుతుంటారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలు జంప్ అయితే.. ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందన్న ఒక ఆశ ప్రజల్లో కలుగుతుంది. దీని ద్వార ఎంతో కొంత మైలేజ్ సాధించవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు.