
2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర దెబ్బతింది. పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 23 సీట్లకే పరిమితమైంది. అందులోనూ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే వైసీపీలో చేరారు. మరికొంత మంది సీనియర్లు కూడా పార్టీని వీడారు. ఇక అప్పటి నుంచి పార్టీలో నిర్వేదం కనిపిస్తూ వచ్చింది. అదేంటో.. ఇప్పుడు కొత్తగా టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోందట. రాష్ట్రవ్యాప్తంగా సీనియర్లు, జూనియర్లు అందరిలోనూ ఇదే ఫీలింగ్ వచ్చిందంట. పార్టీ ఘోర వైఫల్యం తర్వాత ఎవరూ క్రియాశీలకంగా వ్యవహరించకపోవడంతో కార్యకర్తలు సైతం ఎవరూ బయటికి రాలేదు.
Also Read: బాబు ఏ మాత్రం మారలేదట.. : గంటల తరబడి అదే సోదీ
కానీ.. రెండు, మూడు వారాలుగా ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు వచ్చింది. కారణమేంటి..? ఎందుకంటారా..? వైఫల్యాల నుంచి ఇప్పుడిప్పుడే లీడర్లు బయటకు వస్తున్నారట. మైకులు పట్టుకొని ప్రెస్‌మీట్లు పెడుతున్నారట. అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం టార్గెట్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కనిపించని నాయకులు కూడా ఇప్పుడు రోజూ ఏదో ఒక రూపంలో మీడియా ముందుకు వస్తుండడంతో పార్టీలో ఊపు తెచ్చింది. అయితే.. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉండిపోయిన నేతలు.. ఇప్పుడే ఎందుకు నోరు తెరుస్తున్నారని తెలుసుకుంటే త్వరలోనే రాష్ట్రంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయనే ఆశలో ఉన్నారట వీరంతా.
దేశవ్యాప్తంగా అటు కేంద్రం, ఇటు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు జమిలి ఎన్నికలు తెస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు. దీంతో చంద్రబాబు కూడా ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు ప్రతిరోజూ జమిలి ఎన్నికలకు రెడీగా ఉండాలని చెపుతున్నా తమ్ముళ్లు మాత్రం బాబు గారు ఎందుకు మా బుర్రలు తింటున్నారని చర్చించుకుంటున్నారు. అయితే.. ఆదిలో ఈ విషయాన్ని తమ్ముళ్లు పెద్దగా విశ్వసించలేదు. కానీ.. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం కూడా జమిలికి సై అనడంతోటీడీపీ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు.
Also Read: గంటా శ్రీనివాస్ కు వైసీపీలో నో ఎంట్రీ వెనుక అతడేనా?
రాష్ట్రంలో ప్రస్తుతం ఇసుక, మద్యం, పెట్రోల్, నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. వీటికితోడు వైసీపీ నేతలఅక్రమాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్న అంశంపై ఎక్కువగా చర్చలు నడుస్తున్నాయి. దీనిని జాగ్రత్తగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తమ్ముళ్లు భావిస్తున్నారు. అలా సక్సెస్ కాగలగితే గెలుపు సాధ్యమేనని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇదే ఇప్పుడు వీరిలో జోష్ పెరగడానికి కారణమైందని అంటున్నారు పరిశీలకులు. జమిలీ మోడీ నోట రాకముందు వరకు నిర్వేదంలో ఉన్న టీడీపీ నాయకులకు ఈ మాట తర్వాత ఉత్సాహంతో ఉన్నారు. మరి ఈ ఉత్సాహాన్ని ఎన్నికల వరకు కంటిన్యూ చేస్తారా..? లేదా..? మధ్యలోనే చేతులెత్తేస్తారా చూడాలి.