Jamili Elections: 2027లో జమిలి ఎన్నికలు వస్తాయా? ముందస్తు ఎన్నికలు పెట్టే ఆలోచన ఉందా? అందుకే జమిలి బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు జమిలి ప్రస్తావన వస్తోంది. ఇదే హాట్ టాపిక్ అవుతోంది. వాస్తవానికి జమిలి ఆలోచన ఇప్పటిది కాదు. కేంద్రంలో బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు జమిలి ప్రస్తావన తీసుకొచ్చారు మోది. దేశంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపాలన్నది ఈ లక్ష్యం. అందుకే ఈ ఎన్నికల ముంగిట మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక అత్యున్నత కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ జమిలికి అనుకూలంగా నివేదిక ఇచ్చింది. అప్పటినుంచి విస్తృత చర్చ నడుస్తోంది. అందుకు సంబంధించి బిల్లుకు క్యాబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. దీంతో అప్పటి నుంచి 2027లో ముందస్తు ఎన్నికలు తప్పవని ప్రచారం నడిచింది. అయితే అది తప్పని తాజాగా తెలుస్తోంది.
* కత్తి మీద సాము
ఈ అశేష భారతదేశంలో ఏకకాలంలో.. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఒకేరోజు పోలింగ్ నిర్వహించడం అంటే కత్తి మీద సామే. అలాగని దీనిపై ఏకాభిప్రాయం కూడా కుదరడం చాలా కష్టం. అన్ని పార్టీల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో ఇలా బిల్లు పెట్టేసి.. అలా అమలు చేసేసి.. వెంటనే ఎన్నికలు పెట్టేస్తారని చాలామంది భావిస్తున్నారు. అటు అధికారంలో లేని పార్టీలు దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నాయి. కానీ బిల్లులో ఉన్న అంశాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. బిల్లు ఇంకా పార్లమెంటులో పెట్టలేదు కానీ.. అందులో అంశాలను మీడియా వెల్లడిస్తోంది. అయితే తాజాగా బిల్లులో ఓ కీలక అంశం వెలుగులోకి వచ్చింది. దాని ప్రకారం జమిలి ఎన్నికలు 2034లో నిర్వహిస్తారని స్పష్టమైంది. ఇంతలో గ్రౌండ్ ప్రిపేర్ అయ్యేలా చట్టాల సవరణ, ఇతర జాగ్రత్తలు తీసుకునేందుకు కసరత్తు జరుగుతోంది.
* ఆ బిల్లులు మాదిరిగానే
గతంలో చాలా బిల్లులు ఆమోదానికి నోచుకున్నాయి. కానీ అమలు విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా జాప్యం జరుగుతూ వచ్చింది. మహిళా బిల్లు కూడా గతంలో ప్రభుత్వం ఆమోదించింది. కానీ వెంటనే అమల్లోకి రాలేదు. నియోజకవర్గాల పునర్విభజన తరువాతే అమల్లోకి వస్తుందని చట్టంలో చేర్చారు. జమిలి ఎన్నికలకు అదే ఫార్ములాను ఉపయోగిస్తున్నారు. పార్లమెంటులో చేయబోయే రాజ్యాంగ సవరణలో రాజ్యాంగంలో కొత్తగా 82ఏ సెక్షన్ చేర్చబోతున్నారు. ఇది జమిలి ఎన్నికలకు నిర్దేశిస్తుంది. అలాగే 83 సెక్షన్ ప్రభుత్వాల కాల పరిమితికి సంబంధించి మారుస్తారు. ఆర్టికల్ 172, ఆర్టికల్ 327 లో కూడా మార్పులు చేస్తారు. ఎమ్మెల్యేల పదవీకాలం, ప్రజా ప్రతినిధుల విషయంలో పార్లమెంట్ అధికారాలకు సంబంధించిన అంశాలను, వాటికి సంబంధించి సవరణలు చేయనున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Jamili elections are just now thats clear
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com