Jana Sena: గజ దొంగే ఎదుటివారిని ..గజ్జ దొంగ ..గజ దొంగ అని ప్లీనరీ వేదికగా బరితెగించి ప్రజలు వింటే నవ్విపోతారని అనే సిగ్గు లేకుండా పచ్చి అబద్దాలు చెప్పుతూ వైసీపీ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు అవాకులు చెవాకులు వాగుతున్నాడని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆరోపించారు. సిబిఐ దత్తపుత్రుడు.. బిజెపి మానస పుత్రుడు, చంచల్గూడా షటిల్ టీం అంతా ఒక చోటకు చేరి ఎదుటివారి గురించి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుందన్నారు.

జగన్మోహన్ రెడ్డి మీరు చెపుతున్నట్లు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీ మీద తప్పుడు కేసులు పెట్టింది అంటున్నారు.. మీకు ఇన్ని వేల కోట్లు సంపద ఎక్కడ వచ్చింది? మీరు అవినీతి చేయకపోతే? 2004 ఎన్నికల అఫిడివిట్టిలో మీరు నమోదు చేసిన మీ ఆదాయం వనరులు ఎన్ని? మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయినంక అమాంతం మీ సంపదలో పెరిగిపోవడానికి కారణాలను బహిర్గతపరచవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం? నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు పోయి విచారణ ఎదుర్కొని స్వచ్ఛశీలుడిని నిరూపించుకోవాలని జనసేన నేత జయరాంరెడ్డి మండిపడ్డారు. పదేపదే పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటూ మీ అహంకారానికి పవన్ కళ్యాణ్ గారి నిజాయితీకి 2024 ఎన్నికలు ఒక గుణపాఠం కాబోతున్నాయని నీకు హెచ్చరిస్తున్నామన్నారు.
Also Read: Pawan Kalyan Away from PM Modi : పవన్ కళ్యాణ్ భీమవరానికి వెళ్లకపోవడమే సరైన వ్యూహం
నీవు చెప్పినట్లుగా 2019 ఎన్నికల మేనిఫెస్టోలో హామీలను 95% నెరవేర్చుంటే ఇప్పటికే ప్రజలకు అర్థం అయిపోయి ఉంటుంది కదా? ఎందుకు పదేపదే నేను అన్ని హామీలు నెరవేర్చారని చెప్పుకుంటున్నావని జయరాంరెడ్డి ప్రశ్నించారు. నువ్వంత నీతి నిజాయితీపరుడు అయితే మద్యం షాపుల్లో ఎందుకు ఆన్లైన్ సిస్టం ప్రవేశపెట్టలేదు? ఇసుకను నీ బినామీ కంపెనీల ద్వారా ఎందుకు ఆన్లైన్లో లో అమ్మని ఇవ్వకుండా ప్రత్యక్షంగా నగదు తీసుకొని అమ్మిస్తున్నావు? అంటూ మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ కు భయపడుతున్నారు మీరు జగన్ రెడ్డి గారు.. ఎందుకంటే నిజమంటే నీకు భయం దొంగకు ఎప్పుడు కూడా నిజాన్ని చూస్తే భయమేస్తుంది సీఎం గారు అంటూ విమర్శలు గుప్పించారు. అమాంతం అబద్దాలతో సాగిన మీ ప్లీనరీలో నీ నటనను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని.. మీ నీతి మాటలు అన్ని మాటల్లోనే… చేతుల్లో కాదు అని ప్రజలకర్థమైపోయిందని జయరాంరెడ్డి అన్నారు.
నీవు వెన్నుపోటు పొడిచే వ్యక్తివి కావని… ఇది నిజం ఎందుకంటే? కోడి కత్తితో కత్తిపోట్లు, గొడ్డలితో గుండెపోట్లు తెప్పించగల సమర్థవంతమైన నాయకుడు అని రాష్ట్ర ప్రజలకు అర్థమైందని జయరాం రెడ్డి అన్నారు. . నీ దుహంకారానికి నీతి నిజాయితీ పరుడైన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మధ్యన జరిగే యుద్ధమే వచ్చే ఎన్నికలు అంటూ స్పష్టం చేశారు.
Also Read:Adani Group Enter Telecom Spectrum: ముఖేష్ అంబానీతో అదానీ ఢీ.. టెలికాంలో రంగంలో ఇక సంచలనమే