అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌పై కేసులు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. ఆ కేసుల్లో ఏడాదికి పైగా జైలు శిక్ష కూడా అనుభవించాడు. అయితే.. ప్రతిపక్షాలు మాత్రం నిత్యం ఆయనపై 32 క్రిమినల్ కేసులు ఉన్నాయని తప్పుడు ఆరోపణలు చేస్తుంటాయి. ఇప్పుడు హైకోర్టులో ఒక్కో కేసు చిక్కుమడి వీడుతూ జగన్ కు ఊరట లభిస్తోంది. తాజాగా మరోసారి ఏపీ సీఎం జగన్ కు హైకోర్టులో ఉపశమనం కలిగింది.
Also Read: తిరుపతి బరి: గెలిచే సత్తా ఎవరికుంది?
జగన్ ఆస్తుల కేసులపై సీబీఐ చార్జిషీట్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) సీబీఐ కోర్టులో ఆరు చార్జిషీట్లు, నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో ఒక చార్జిషీట్ దాఖలు చేసింది.
ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ కు స్వాంతన చేకూరే నిర్ణయం వెలువడింది. నాంపల్లి కోర్టులో ఉన్న ఒక ఈడీ చార్జిషీట్ ను కూడా సీబీఐ కోర్టుకే బదిలీ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈనెల 30న నాంపల్లి కోర్టులో కేసు విచారణ ఉన్నందున ఆరోజు బదిలీ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది.
Also Read: తిరుపతి ఉపఎన్నిక: అగమ్యగోచరంగా పవన్ కళ్యాణ్ పరిస్థితి
సీబీఐ కోర్టులో ప్రధాన కేసులు పెండింగ్ లో ఉన్నాయి. నాంపల్లి కోర్టులో అరబిందో, హెటిరో భూ కేటాయింపులకు సంబంధించిన ఈడీ కేసు కూడా పెండింగ్ ఉంది. ఈ క్రమంలోనే సీబీఐ కోర్టుకే ఈడీ కేసు బదిలీ చేయాలని జగతి పబ్లికేషన్స్ కోరింది.
నాంపల్లి కోర్టు దీన్ని నిరాకరించడంతో హైకోర్టును జగతి పబ్లికేషన్స్ ఆశ్రయించింది. విచారణ జరిపి అన్ని ఒకే చోట విచారణ జరిపేందుకు వీలుగా అరబిందో, హెటిరో ఈడీ కేసు కూడా సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్