CM Jagan Gets Negative Review: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వ్యూహాలు మారుతున్నాయి. పార్టీల్లో అధికార కాంక్ష పెరుగుతోంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఒక్క చాన్స్ అంటూ జగన్ 2019లో ప్రజలను ఓట్లడిగి అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు మరో చాన్స్ అనే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. అధికారంలోకి రావాలని మళ్లగుల్లాలు పడుతున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో జగన్ కు మంచి మార్కులే పడ్డాయి. కానీ సంక్షేమ పథకాల అమలులో కూడా ఆయనకు ఎదురే లేదని తెలుస్తోంది.

అభివృద్ధి పనులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ప్రతిపిక్షాలు కూడా ఇదే అంశాన్ని పట్టుకుంటున్నాయి. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఈ క్రమంలో అవి అభివృద్ధి పనులు చేపట్టడంలో జగన్ విఫలమయ్యారని దుమ్మెత్తిపోస్తున్నాయి. దీంతో జగన్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇదే పాయింట్ తో జగన్ ను కడిగేసేందకు కూడా సిద్ధమయ్యాయి. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఏం చెబుతారు? నిధులు లేవని చెబుతారా? అప్పులు పెరిగాయని చెబుతారా? అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి.
Also Read:TDP: టీడీపీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి?
ఇప్పటికే రాష్ట్ర అప్పుల భారం ఏడు లక్షల కోట్లకు చేరిందట. వడ్డీలు తీర్చడానికి కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆర్థిక వ్యవస్థ ఎంతలా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అప్పుల భారం నుంచి గట్టెక్కే మార్గం కనిపించడం లేదు. అధికారం వచ్చినా ప్రభుత్వాన్ని నిర్వహించే సత్తా కూడా జగన్ కు కనిపించడం లేదు. దీంతో ప్రస్తుతం ఏం నిర్ణయం తీసుకోవాలనే దానిపైనే ఆలోచనలో పడిపోయారు. రాష్ట్ర పరిస్థితి రోజురోజుకు అగమ్యగోచరంగా మారుతోంది.
ప్రతిపక్షాలన్ని ఏకమైతే జగన్ కు చుక్కెదురే అనే భయం వెంటాడుతోంది. పైగా జగన్ తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో అసంతృప్తిని రగిలిస్తున్నాయి. ఏకపక్ష నిర్ణయాలతో తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు తెలుస్తోంది. మూడురాజధానుల వ్యవహారం, కొత్త జిల్లాల ఏర్పాటు తదితర కార్యక్రమాలతో ప్రజల్లో హేళన అయిపోయారు. ఇప్పుడు ఓట్లడితే వారు వేస్తారా? జగన్ ను అసహ్యించుకునే అవకాశాలు లేకపోలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారనే దానిపై చర్చ సాగుతోంది.

జగన్ కు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చ చేసుకోలేదు. ప్రజావ్యతిరేక విధానాలు తీసుకుని వారికి ఇబ్బందులు తెచ్చారు. దీంతో వారిలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో జగన్ పార్టీ వైసీపీని తుంగలో తొక్కడం ఖాయమనే అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. ఏదిఏమైనా రాష్ట్రంలో జగన్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనేది మాత్రం సత్యం.
Also Read: Janasena Party: జనసేనలోకి ఆ రెండు పార్టీలు.. ఏపీ భవిష్యత్తు సీఎం పవన్ కళ్యాణ్ యేనా?
[…] […]
[…] SRH vs RR IPL 2022: రామేశ్వరం వచ్చినా శనేశ్వరం పోలేదన్నట్టు తయారైంది సన్ రైజర్స్ పరిస్థితి. 2021 ఐపీఎల్ లో సన్ రైజర్స్ ఎంత చెత్తగా ఆడి అభిమానుల ఆగ్రహానికి గురయిందో చూశాం. ఇప్పుడు తాజా సీజన్ లో కూడా ఇదే పంతాను కొనసాగిస్తోంది. ఈ సీజన్ ను ఘోర ఓటమితో ప్రారంభించింది. అత్యంత చెత్త బౌలింగ్, బ్యాటింగ్ తో ప్రదర్శన చేసి.. మరోసారి తామింతే అని తెలిపింది. […]
[…] Bigg Boss OTT Telugu: రియాలిటీ షోలలో బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గతంలో బుల్లితెరపై అలరించిన ఈ షో.. ఇప్పుడు ఓటీటీ వేదికగా మస్తు మజాను పంచుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త టాస్క్ లు, కంటెస్టెంట్స్ మధ్య విపరీతమైన గొడవలతో దుమ్ము లేపుతోంది. ఇక అన్నిటికంటే పెద్ద సవాలు ఏదైనా ఉంది అంటే అది నామినేషన్ ప్రక్రియ అని చెప్పుకోవాలి. […]
[…] […]