Registrations: ప్రజల ఆస్తులతో జగన్ కంప్యూటర్ గేమ్

ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ జరిగితే వాటి ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం వద్దే ఉంటాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తై ఒరిజినల్ దస్తావేజులు అందించడంలో జాప్యం జరుగుతోందని.. దీనిని నియంత్రించేందుకే ఈ విధానం చేపడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

Written By: Dharma, Updated On : September 2, 2023 10:49 am

Registrations

Follow us on

Registrations: సాధారణంగా ఆస్తి పత్రాలను చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. నగదు, బంగారం కంటే మించి వాటిని కాపాడుకుంటాం. అయితే ఇప్పుడు జగన్ సర్కార్ ప్రజలకు ఆ పని లేకుండా చేయాలని భావిస్తోంది. ఆస్తి పత్రాలకు సంబంధించి కలర్ జిరాక్స్ లను మాత్రమే ప్రజలకు అందించనుంది. ఒరిజినల్ ను మాత్రం తమ వద్ద సంరక్షించనుంది. ఒకవేళ సర్టిఫైడ్ కాపీ కావాలనుకుంటే ఫీజు కట్టి అది వచ్చేదాకా వేచి చూడాల్సిందే. అయితే ఇది ప్రజల ఆస్తులను తన గుప్పెట్లో ఉంచుకొనే భారీ కుట్రకు జగన్ సర్కార్ తెరతీసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ జరిగితే వాటి ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం వద్దే ఉంటాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తై ఒరిజినల్ దస్తావేజులు అందించడంలో జాప్యం జరుగుతోందని.. దీనిని నియంత్రించేందుకే ఈ విధానం చేపడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ ఒరిజినల్ పత్రాల స్థానంలోకి జిరాక్స్ పత్రాలు చేరితే ఆర్థిక మోసాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకే ఆస్తిని ఎన్నిసార్లు అయినా అమ్ముకునేందుకు సర్కారే తలుపు తెరిచిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అటు ప్రభుత్వం వద్ద ఒరిజినల్ ఆస్తి పత్రాలు సురక్షితంగా ఉంటాయో లేదో నన్ను భయం ప్రజలను వెంటాడుతోంది. ఎన్నెన్నో అనుమానాలు ఉన్నాయి. అయినా సరే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

ముఖ్యమంత్రి కార్యాలయంలోని కార్యదర్శుల సంతకాలనే ఫోర్జరీ చేసి న కాలం ఇది. అటువంటిది గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రక్రియ జరుగుతుందని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. దీంతో ఏ స్థాయిలో పరిధిలో ఉంటాయో తెలియదు కాదు. విపరీతమైన రాజకీయ జోక్యం తప్పనిసరిగా ఉంటుంది. అత్యంత కట్టుదిట్టమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఉండే సీఎం కార్యాలయంలోనే సీఎం, సీఎంఓ అధికారుల డిజిటల్ సంతకాలను ఫోర్జరీ చేశారు. వందలాది ఫైళ్ళకు క్లియరెన్స్ ఇచ్చేశారు. అటువంటిది రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజల ఒరిజినల్ ఆస్తుల పత్రాలు ఉండడం ఎంతవరకు సేఫ్? ఇలాంటి పరిస్థితుల్లో ఆస్తి కొనుగోలు చేసిన వారికి ఒరిజినల్ ఇవ్వకుండా జిరాక్స్ చేతిలో పెట్టి… అందులో ఉన్నదే వాస్తవం అంటే ఎలా నమ్మగలం? మరోవైపు జిరాక్స్ కాపీని పెట్టి ఎన్ని బ్యాంకుల్లోనైనా తాకట్టు పెట్టే అవకాశం ఉందని.. ఆర్థిక మోసాలు పెరిగే ప్రమాదం ఉందని బ్యాంకింగ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికైతే ప్రభుత్వం ఎటువంటి ముందస్తు సన్నాహాలు లేకుండా చేపడుతున్న ఈ కొత్త విధానంతో.. మొదటికే మోసం వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.