నో అవినీతి: చంద్రబాబుకు జగన్ క్లీన్ చిట్

40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు అక్కడ. అందుకే ఎన్ని సార్లు సీఎం అయినా.. ఎప్పుడూ దొరకలేదు.. చిక్కలేదు. అవినీతిలో బయటపడలేదు. కోర్టుల్లో కూడా కేసులు నిలవలేదు. చంద్రబాబు మేనేజ్ మెంట్ లక్షణాలకు ఇదో మచ్చుతునక అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవును.. ఎక్కడ దొరుకుతాడా మూసేద్దాం అని చూస్తున్న వైసీపీ అధినేత, సీఎం జగన్ కు కూడా దొరకకుండా పకడ్బందీ గత ప్రభుత్వంలో పనులు చేసిన చంద్రబాబు తెలివిని నిజంగానే మెచ్చుకోవాల్సిందే.. ఎంతలా అంటే స్వయంగా జగన్ […]

Written By: NARESH, Updated On : June 27, 2020 6:42 pm
Follow us on


40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు అక్కడ. అందుకే ఎన్ని సార్లు సీఎం అయినా.. ఎప్పుడూ దొరకలేదు.. చిక్కలేదు. అవినీతిలో బయటపడలేదు. కోర్టుల్లో కూడా కేసులు నిలవలేదు. చంద్రబాబు మేనేజ్ మెంట్ లక్షణాలకు ఇదో మచ్చుతునక అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవును.. ఎక్కడ దొరుకుతాడా మూసేద్దాం అని చూస్తున్న వైసీపీ అధినేత, సీఎం జగన్ కు కూడా దొరకకుండా పకడ్బందీ గత ప్రభుత్వంలో పనులు చేసిన చంద్రబాబు తెలివిని నిజంగానే మెచ్చుకోవాల్సిందే.. ఎంతలా అంటే స్వయంగా జగన్ సర్కారే చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చేసింది. కేంద్రం కూడా అవినీతి లేదని తేల్చేసింది. ఇదీ మరీ చంద్రబాబు తెలివితేటలు అంటే అని టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.

పవన్ ప్రశ్నకి జవాబు చెప్పకుండా ఈ గోడవలేంది గురువా?

దశాబ్ధాలుగా పెండింగ్ లో ఉన్న ఏపీ కలల ప్రాజెక్టు పోలవరం పూర్తి చేయడానికి ఎందరో ఏపీ సీఎంలు ప్రయత్నించి విఫలమయ్యారు. గత చంద్రబాబు హయాంలోనూ అంచనాలు పెంచేసి.. అడ్డదిడ్డంగా పనులు చేసి.. పగుళ్లు వచ్చి నాసిరకం అంటూ చాలా విమర్శలొచ్చాయి. విడిపోయిన నవ్యాంధ్రకు సాయంగా కేంద్రమే పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి వేల కోట్ల నిధులు కేటాయించింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ‘పోలవరం’ను ఏటీఎంలా వాడేసుకుందని వైసీపీ నాడు ఆరోపించింది.

అధికారంలోకి రాగానే పోలవరం కాంట్రాక్టును రద్దు చేసి కొత్తవారికి ఇచ్చిన జగన్.. చంద్రబాబు హయాంలో పోలవరం అవినీతిపై విచారణ కమిటీ కూడా వేశారు. కానీ దాని రిజల్ట్ ఏంటనేది తెలియరాలేదు..

తాజాగా చంద్రబాబు ప్రభుత్వంలో పోలవరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. దీనిపై విచారణ జరపాలని సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయనకు కేంద్ర జలశక్తి శాఖ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది.

కేసీఆర్ టార్గెట్ గా.. రాష్ట్రానికి కేంద్ర బృందం రానుందా?

పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై కేంద్రం అధికారికంగా స్పందించింది. షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఆధారాలు లేవని.. విచారణ అవసరం లేదని కేంద్ర జలశక్తి స్పష్టం చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక వేసిన కమిటీ నివేదికను రాష్ట్ర సర్కారే పక్కనపెట్టిందని.. నిబంధనల మేరకే పోలవరం నిర్మాణం జరుగుతోందని జగన్ ప్రభుత్వం కమిటీ చెప్పిందని కేంద్ర జలశక్తిశాఖ వెల్లడించింది. కాబట్టి పోలవరంపై విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది.

దీన్ని బట్టి పోలవరంలో చంద్రబాబును బుక్ చేద్దామని చూసిన జగన్ కు ఆ లెక్కలు పత్రాల్లో ఏలాంటి బొక్కలు దొరకలేదని తెలుస్తోంది. చంద్రబాబు ఎంతో చాకచక్యంగా పోలవరంను కొనసాగించాడని తేలింది. పోలవరంలో అవినీతి లేదని అటు కేంద్రం.. ఇటు స్వయంగా ఆరోపణలు గుప్పించిన జగన్ ప్రభుత్వం కూడా క్లీన్ చిట్ ఇవ్వడం నిజంగానే చంద్రబాబుకు గొప్ప ఊరట అని.. ఆయన పనితనానికి ఇది నిదర్శనమని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబును ఏ కేసులోనూ ఇరికించలేరని అంటున్నాయి.

-ఎన్నం