అది 2011 సెప్టెంబరు 5, 6. కర్నూలు జిల్లా ఆదోనిలో తీవ్ర మత ఘర్షణలు జరిగాయి. వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా.. రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. కావాలని అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికార పార్టీగా ఉన్న వారిలో కొందరు కావాలనే ఈ అల్లర్లు రేపారని ఆరోపణలు ఉన్నాయి. ఆ సందర్భంగా ఆదోని ప్రజాజీవితం రెండు రోజులు స్తంభించిపోయింది. బిక్కుబిక్కుమంటూ జనం గడిపారు. ఆ ఘటనలపై నమోదైన 33 కేసులను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. విచారణను ఉపసంహరించుకుంటూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేయించాలని డీజీపీని ఆదేశించింది.
Also Read: స్థానిక ఎన్నికలపై సీఎం జగన్ మాస్టర్ ప్లాన్
ఎప్పటికప్పుడు ఏపీలో శాంతిభద్రతల పరంగా జరుగుతున్న విన్యాసాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి.. పోలీసులనే కొట్టిన అల్లరి మూకలపై కేసులు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. తాజాగా ఏకంగా మత ఘర్షణల కేసులనూ ఎత్తివేయడానికి నిర్ణయించుకుందట.
ఈ నిర్ణయం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. మారణాయుధాలతో హల్ చల్ చేసి.. అనేక మంది ప్రాణభీతికి కారణమైన.. పదుల సంఖ్యలో బాధితులు ఉన్న మత కల్లోలాల కేసులను ఎత్తివేయాలనే ఆలోచన ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వానికీ వచ్చి ఉండదు. కానీ ప్రస్తుత ఏపీ సర్కార్ మాత్రం.. ఆ కేసుల్ని ఎత్తివేయాలని పోలీసులను ఆదేశించింది.
Also Read: జగన్ రాజకీయ పరిణితి సాధించినట్లే..!
ఈ కేసులను ఎత్తివేయాలని నిర్ణయించిన నిందితులపై ఉన్న అభియోగాలు మామూలువి కావు. ఆస్తుల విధ్వంసం, అల్లర్లకు పాల్పడటం, మారణాయుధాలతో ప్రదర్శన చేయటం, రెండు మతాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించటం, ఇళ్లు కొల్లగొట్టటం, అక్రమంగా చొరబడటం, ఇళ్లను తగలబెట్టాలనే ఉద్దేశంతో అగ్గి, పేలుడు పదార్థాలు వినియోగించటం, ప్రమాదకర ఆయుధాలతో దాడి చేయటం, హత్యాయత్నం వంటి కేసులు ఉన్నాయి. ఇంత భయంకర వాతావరణం సృష్టించిన వారి మీద కేసులను ఎత్తివేస్తూ పోతే.. రాష్ట్రంలో అరాచకాలకు ఇక ఎలా అడ్డుపడేది. మత ఘర్షణలూ తలెత్తే అవకాశాలూ లేకపోలేదని రాజకీయ నిపుణులు అంటున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్