ఇదేనా మానవత్వం కేసీఆర్ సార్?

ఇప్పుడు సమాచారంలో అన్నింటికంటే పెద్ద టాస్క్ ప్రాణాలు కాపాడుకోవడమే. ఏపీలోని జిల్లాల్లో పెద్ద, కార్పొరేట్ ఆస్పత్రులు లేకపోవడంతో ప్రాణభయంతో అందరూ హైదరాబాద్ కు అంబులెన్స్ లో వస్తున్నారు. కానీ వారిని తెలంగాణ సరిహద్దుల్లో ఆపి వెనక్కి పంపించేస్తోంది తెలంగాణ సర్కార్. హైదరాబాద్ నగరంలోకి రాకుండా అడ్డుకుంటోంది. దీనిపై హైకోర్టు తాజాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేనా మానవత్వం అంటూ కేసీఆర్ సర్కార్ పై మండిపడింది హైకోర్టు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు అత్యవసర విచారణ […]

Written By: NARESH, Updated On : May 11, 2021 12:25 pm
Follow us on

ఇప్పుడు సమాచారంలో అన్నింటికంటే పెద్ద టాస్క్ ప్రాణాలు కాపాడుకోవడమే. ఏపీలోని జిల్లాల్లో పెద్ద, కార్పొరేట్ ఆస్పత్రులు లేకపోవడంతో ప్రాణభయంతో అందరూ హైదరాబాద్ కు అంబులెన్స్ లో వస్తున్నారు. కానీ వారిని తెలంగాణ సరిహద్దుల్లో ఆపి వెనక్కి పంపించేస్తోంది తెలంగాణ సర్కార్. హైదరాబాద్ నగరంలోకి రాకుండా అడ్డుకుంటోంది.

దీనిపై హైకోర్టు తాజాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేనా మానవత్వం అంటూ కేసీఆర్ సర్కార్ పై మండిపడింది హైకోర్టు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. కోవిడ్ పరీక్షలు తగ్గించడం.. కేసులు తక్కువగా చూపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు భేఖతరు చేసిన వైనంపై కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇక ప్రాణభయంతో మెరుగైన చికిత్స కోసం ఏపీ నుంచి వస్తున్న కోవిడ్ రోగులను వారి అంబులెన్స్ లను సరిహద్దుల్లో అడ్డుకోవడంపై హైకోర్టు ఫైర్ అయ్యింది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్లకు టెస్టులు చేయాలని సూచించామని.. కానీ అడ్డుకోవాలని చెప్పలేదని హైకోర్టు స్పష్టం చేసింది. అంబులెన్స్ లు అడ్డుకోవడం అమానుషం అని హైకోర్టు నిలదీసింది.

ఇక తెలంగాణ అంతటా కోవిడ్ నిబంధనలు అమలు అవుతుండగా.. ఎంఐఎం ఇలాఖా పాతబస్తీలో మాత్రం అలాంటి అమలు కావడం లేదని కోర్టు దృష్టికి వచ్చింది. దీనిపై తీవ్రంగా ప్రభుత్వాన్ని మందలించింది.

ఇక లాక్ డౌన్ విధిస్తారా? లేదా నిబంధనలు కఠినతరం చేస్తారో చెప్పాలని తాజాగా కేసీఆర్ సర్కార్ ను గట్టిగా హైకోర్టు కోరింది. ఈ రోజు మధ్యాహ్నం కేబినెట్ భేటి ఉందని.. అనంతరం లాక్ డౌన్, కర్ఫ్యూ పై ప్రభుత్వం తేలుస్తుందని అడ్వకేట్ జనరల్ వివరణ ఇచ్చారు.

మొత్తం ఏపీ వాసులను తెలంగాణలోకి రాకుండా కేసీఆర్ సర్కార్ అడ్డుకుంటున్న తీరుపై ప్రజల నుంచే కాదు.. హైకోర్టు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం విశేషం. ఇలాంటి పరిణామాలు మానవత్వానికే మచ్చు తునక అని హైకోర్టు వ్యాఖ్యానించింది.