
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. సర్కారు నిర్వహణకు సీఎం జగన్ నానా తంటాలు పడుతున్నారు. అప్పుల భారంతో నెలనెల ఇబ్బందులు పడుతోంది. కరోనా విలయంతో పరిస్థితి ఊహించనంత దెబ్బతింది. ఎన్ని రకాల పొదుపు మంత్రం పాటిస్తూనే గాడి నడవడం లేదు. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దానిపైనే సర్కారు దృష్టి సారిస్తోంది. దీనికి బీజేపీ నాయకత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పూర్తిగా నిలిచే అవకాశం ఏర్పడింది.
ప్రభుత్వ యంత్రాంగానికి ఇంధనం డబ్బే. నిధుల సమకూర్చుకోవడానికి ఉన్న అన్ని దారులను పరిశీలిస్తోంది. ఎలాగైనా గండం నుంచి బయటపడే మార్గాలు అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీకి ఓ కొత్త మార్గం కనిపించింది. మధ్యప్రదేశ్ రాష్ర్టంలోని శివరాజ్ సింగ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు ఏళ్ల పాటు సెలవులు ఇవ్వాలని భావించింది. దీంతో ఖజానాపై భారం పడకుండా ఉండేందుకు పక్కా ప్రణాళిక రచిస్తోంది. దీంతో ఏటా ఆరు వేల కోట్ల మేర ఆదా కానుంది. ఉద్యోగులను పొమ్మనకుండా పొగబెట్టినట్లు అవుతుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని గడ్డు స్థితిలోకి జగన్ ప్రభుత్వం దిగజారనట్లు తెలుస్తోంది. దీంతో సీఎం జగన్ కు బీజేపీ దారి చూపినట్లు అవుతుంది. మధ్యప్రదేశ్ లో మాదిరి ఇక్కడ కూడా ఇదే విధానం పాటంచాలని చూస్తున్నట్లు సమాచారం. ఆర్థిక బాధలను అధిగమించే పనిలో భాగంగా ఏపీ సర్కారుకు వేరే మార్గం కనిపించడం లేదు. గత్యంతరం లేకే ఈ ఆలోచన అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రోజురోజుకు అప్పుల భారం పెరిగిపోతోంది. ఖజానా ఖాళీ కావడంతో ఎలాగైనా ముప్పును తప్పించుకోవాలనే ఉద్దేశంలో సర్కారు ఊగిసలాడుతోంది. రానున్న గండాలను తప్పించుకునేందుకు తపిస్తోంది. ఆర్థిక ఇబ్బందులను తొలగించుకునేందుకే తాపత్రయ పడుతోంది. ఏపీలో జగన్ కనుక ఈ విధానాన్ని పాటిస్తే తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయోనని యోచిస్తోంది. సర్కారు సమస్యల సాధనకు రంగంలోక దిగాలని చూస్తోంది.