Sea sink to AP : నిన్నమొన్నటి వరకు ఉన్న గుడి ఇప్పుడు కనిపించడం లేదు.. అక్కడ రాకపోకలు సాగే రోడ్డు కనుమరుగైంది. ఎప్పడు ఇల్లు కూలుతుందో తెలియదు.. ఎప్పుడు నీళ్లు పైకి వస్తాయో.. తెలియదు.. అన్న ఆందోళనతో భయ భయంగా బతుకున్నారు ఉప్పాడ గ్రామస్థులు. ఆ ఊళ్లో ఇప్పటి వరకు మూడు పాఠశాలలు, రెండు ట్రావెలర్స్ బంగ్లాలు సముద్రంలో కలిసిపోయాయి. ఇటీవ ‘ఉప్పెన’ సినిమాలో కనిపించి గుడి సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఇక రాను రాను ఇళ్లు కూడా మునిగే ప్రమాదం ఎంతో దూరంలో లేదంటున్నారు. అయితే ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది. ఇందుకోసం ప్రభుత్వం జియో ట్యూబ్ ఏర్పాటు చేసింది. కానీ అదికూడా ధ్వంసమైంది. సముద్ర ఆపద ఎప్పుడు ఏ రూపంలో వస్తుందోనని గ్రామస్థులు వణికిపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో ఉప్పాడ గ్రామం ఉంది. ఇక్కడ చేనేత కార్మికులు, మత్స్యకారులు ఎక్కువగా ఉన్నారు. సముద్రంపై ఎక్కువగా ఆధారపడే మత్స్యకారులు ఇక్కడే ఏన్నో ఏళ్లుగా జీవిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ సముద్రమే వారిని మింగేస్తుందని అంటున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 12 వేల మంది ఈ ఊరి జనాభా ఉంది. రెవెన్యూ రికార్డలు ప్రకారం ఉప్పాడ ఊరి విస్తీర్ణం 137 హెక్టార్లు కలిగి ఉండగా.. ఇప్పటికే 40 హెక్టార్లు సముద్రగర్భంలో కలిసిపోయింది. సముద్ర తీరాన ఉన్న రామాలయం కోతకు గురికాగా.. కొంత దూరం జరిపి కట్టారు. అయితే ఇప్పుడు అదికూడా ధ్వంసమైంది.
అమావాస్య, పౌర్ణమి రోజుల్లో పెద్ద పెద్ద శబ్దాలతో అలలు వస్తుంటాయి. ఒక్కోసారి ఈ అలలు ఇళ్లను తాకవడం వల్ల పాఠశాలలకు వెళ్లి తలదాచుకుంటాం. మళ్లీ తెల్లారి వచ్చి ఇల్లు శుభ్రం చేసుకుంటాం. కొన్ని రోజుల పాటు ఇలాగే ఉండే వేరే ఇళ్లల్లో అద్దెకు ఉండాల్సి వస్తోందని తీర ప్రాంతాల వాసులు అంటున్నారు. బడులు, మార్కెట్ కూడా సముద్రంలో కలిసిపోయింది. తీర ప్రాంతాల వాళ్లు తమ ఇళ్లు కోల్పోతే మెరక గ్రామానికి వలస వెళ్లారు. కొందరు వృద్దులు మాట్లాడుతూ తమ చిన్నప్పడు ఎక్కడో దూరాన ఉన్న సముద్రం ఇప్పుడు ఇంటిపక్కకే వచ్చిందని అంటున్నారు. ఇక ఇటీవల ఉప్పెన సినిమాలో కనిపించిన గుడి ఇప్పుడు కోతకు గురయిందని పేర్కొంటున్నారు. సినిమా క్లౌమాక్స్ లో హీరో, హీరోయిన్లు గుడి దగ్గర కూర్చుంటారు. ఆ సీన్ తీసిన గుడి ఇప్పుడు కోతకు గురయింది. అనవాళ్లు ఉన్నాయని అంటున్నారు. అంటే సముద్రం ఎంత వేగంగా ముందుకు వస్తుందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.
ఈ పరిస్థితి కేవలం ఉప్పాడ గ్రామానిదే కాదు. బంగాళాఖాతం తీరానికి అనుకొని ఉన్న సుబ్బంపేట, కోనపాపపేట, విశాఖ జిల్లాలో ఉన్న పూడిమడక గ్రామాలు సైతం ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నాయి. అయితే ఒక్క ఉప్పాడ కొత్తపల్లి మండలంలో 900 ఎకరాలు సముద్రం పాలయిందని కాకినాడ రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. అయతే ప్రస్తుతానికి ప్రమాదస్థాయిలో ఉన్న వారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నమని, ఆ తరువాత శాశ్వత పరిష్కారం గురించి ప్రయత్నిస్తామని అంటున్నారు.
ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం జియో ట్యూబ్ ఏర్పాటు చేసింది. కాకినాడ పోర్టు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పాడలో పెద్ద పెద్ద బండరాళ్లతో సముద్రపు ఒడ్డున గోడలాగా ఏర్పాటు చేశారు. అయితే అలల తాకిడికి అదికూడా కొట్టుకుపోయింది. అయితే బీచ్ రోడ్డుకు వేసిన పెద్ద రాళ్లు మాత్రం అలల తాకిడికి తట్టుకుంటున్నాయి. అయితే గ్రామానికి అనుకొని వేసిన రోడ్డు మాత్రం ధ్వంసమైంది. వైఎస్ ప్రభుత్వ హయాంల 12.6 కోట్లతో జియో ట్యూబ్ ను ఏర్పాటు చేశారు.