https://oktelugu.com/

చంద్రబాబు ఇప్పటికైనా తన తీరును మార్చుకోరా…?

రాజకీయాల్లో ఉన్న అగ్ర నేతలు ప్రజలకు మంచి చేసే, ప్రయోజనం చేకూర్చే రాజకీయాలు చేస్తే బాగుంటుంది. అలా కాకుండా చనిపోయిన వాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే మాత్రం అస్సలు బాగుండదు. కానీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం చనిపోయిన వారిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అర్థం పర్థం లేని విమర్శలు చేస్తూ చంద్రబాబు వార్తల్లో నిలుస్తున్నారు. Also Read : ఈ వైసీపీ ఎంపీ మాటలు భలే ఉన్నాయే..? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 18, 2020 / 02:03 PM IST
    Follow us on


    రాజకీయాల్లో ఉన్న అగ్ర నేతలు ప్రజలకు మంచి చేసే, ప్రయోజనం చేకూర్చే రాజకీయాలు చేస్తే బాగుంటుంది. అలా కాకుండా చనిపోయిన వాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే మాత్రం అస్సలు బాగుండదు. కానీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం చనిపోయిన వారిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అర్థం పర్థం లేని విమర్శలు చేస్తూ చంద్రబాబు వార్తల్లో నిలుస్తున్నారు.

    Also Read : ఈ వైసీపీ ఎంపీ మాటలు భలే ఉన్నాయే..?

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి బారిన పడి రెండు రోజుల క్రితం తిరుపతి అధికార పార్టీ ఎంపీ చనిపోయిన విషయం విదితమే. పార్టీ ముఖ్య నేత చనిపోవడంతో వైసీపీ వర్గాల్లో విషాద వాతావరణం అలుముకుంది. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొని ఉంటే జగన్ ఎంపీ కుటుంబాన్ని పరామర్శించేవారు. కానీ కరోనా వల్ల ముఖ్యమైన కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్న నేపథ్యంలో ఎంపీ కుటుంబాన్ని జగన్ పరామర్శించలేదు.

    దీంతో చంద్రబాబు సొంత పార్టీ ఎంపీ చనిపొతే కుటుంబాన్ని పరామర్శించకపోవడం జగన్ లోని కర్కశత్వానికి ఉదాహరణ అని కామెంట్లు చేశారు. చంద్రబాబుకు వయస్సు మీద పడిందని అందువల్లే చాదస్తంతో కూడిన మాటలు మాట్లాడుతున్నారని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తూ తమకు నీతులు చెప్పడం ఏమిటని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

    జగన్ కొన్ని రోజుల తరువాత ఎంపీ కుటుంబాన్ని పరామర్శించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంట్లో కూర్చుని ఇలాంటి కబుర్లు చిన్న పిల్లాడైనా చెప్పగలడని… చంద్రబాబు ప్రతిపక్షనేత హోదాలో ఉంటూ ఇలాంటి ప్రయోజనం లేని విమర్శలు చేయడం సరికాదని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

    Also Read : వైసీపీ ఎమ్మెల్యేకు కోర్టు షాక్… కేసు పెట్టాలని ఆదేశాలు..?