Site icon OkTelugu

పాక్‌పై ఇరాన్‌ సర్టికల్‌ స్ట్రైక్‌

Surgical strike
ఇన్నాళ్లు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ పాకిస్తాన్‌ ఇతర దేశాలపై ఉగ్ర దాడులకు పాల్పడేది. పాకిస్తాన్‌ తీవ్రవాదులే ఆ ఘాతుకానికి పాల్పడినా తమ దేశం పని కాదంటూ బుకాయించేది. కానీ.. ఇప్పుడు ఇరాన్‌ దేశం ఏకంగా పాకిస్తాన్‌ దేశంపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేసేసింది. ఇరాన్‌ సైన్యంలోని సుశిక్షిత రివల్యూషనరీ గార్డ్స్‌ దళం ఈ సర్టికల్‌ స్ట్రైక్‌ను చేపట్టింది. రెండున్నరేళ్లుగా బలూచిస్థాన్‌ ఉగ్రవాదుల చెరలో ఉన్న తమ సైనికులిద్దరిని విడిపించుకెళ్లింది.

Also Read: జగన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

నిఘా సమాచారం ఆధారంగా మంగళవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లుగా ఐఆర్‌‌జీసీ తాజాగా వెల్లడించింది. బలూచిస్థాన్‌లోని జైష్‌ ఉల్‌ అదల్‌ అనే ఉగ్రవాద ముఠా 2018లో 12 మంది ఇరాన్‌ సైనికులను అపహరించింది. వారిని రెండు దేశాల సరిహద్దుల్లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో మెర్కావా నగరానికి తరలించింది. ఈ ముఠా కొన్నేళ్లుగా ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ ఉద్యమాన్ని నడిపిస్తోంది.

అయితే.. ఇరాన్‌ సైనికులను విడిపించడానికి పాక్‌, ఇరాన్‌ ఒక కమిటీని ఏర్పాటు చేశాయి. 2018 నవంబర్‌‌లో ఐదుగురు బందీలకు విముక్తి లభించింది. మరో నలుగురిని 2019లో పాక్‌ సైన్యం విడిపించింది. తాజాగా.. మెరుపు దాడుల్లో ఇద్దరు బందీలకు విముక్తి దొరికింది. జైష్‌ ఉల్‌ అదల్‌ ఇరాన్‌లో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడింది.

Also Read: విజయసాయి అందుకే పార్లమెంట్‌ సమావేశాల నుంచి వచ్చేశారా..?

2019 ఫిబ్రవరిలో పదుల సంఖ్యలో భద్రతా సిబ్బందిని చంపేసింది. ఇరాన్‌ సరిహద్దుల్లో భద్రతా సిబ్బందిని అపహరించి.. పాక్‌కు తరలించుకెళ్లిన ఉదంతాలు గతంలోనూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌ తీరుపై ఇరాన్‌ సైన్యం ఆందోళన వ్యక్తం చేసింది. సరిహద్దు భద్రతపై పొరుగు దేశం తీరు చాలా ఉదాసీనంగా ఉందని చెప్పింది. 2016లో భారత సైన్యంలోని పారా కమాండోలు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి అనేక మంది ముష్కరులను హతమార్చారు. ఇప్పుడు ఇరాన్‌ వంతు వచ్చినట్లయింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Exit mobile version