https://oktelugu.com/

బైడెన్‌ తో బలపడనున్న భారత్‌–అమెరికా బంధం!

అగ్రరాజ్యం ఆమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికయ్యారు. దీంతో భారత్‌ ఆయన సంబంధాలు ఎలా ఉండబోతాయా అని అందరిలోనూ ఆసక్తి కనిపిస్తోంది. మరోవైపు బైడెన్‌ సారథ్యంలో భారత్‌–అమెరికా బంధాలు మరింత బలపడుతాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. బైడెన్‌ ఇదివరకు ఇచ్చిన హామీలు, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా విశ్లేషకులు ఈ మేరకు ఈ అభిప్రాయానికి వచ్చారు. మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు ట్రంప్‌ తరహాలో చైనా విషయంలో బైడెన్‌ దూకుడుగా వెళ్లకపోవచ్చని.. అయితే అమెరికాను తిరిగి అగ్రస్థానాన నిలబెట్టడానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2020 10:56 am
    Follow us on

    Modi Joe Biden

    అగ్రరాజ్యం ఆమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికయ్యారు. దీంతో భారత్‌ ఆయన సంబంధాలు ఎలా ఉండబోతాయా అని అందరిలోనూ ఆసక్తి కనిపిస్తోంది. మరోవైపు బైడెన్‌ సారథ్యంలో భారత్‌–అమెరికా బంధాలు మరింత బలపడుతాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. బైడెన్‌ ఇదివరకు ఇచ్చిన హామీలు, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా విశ్లేషకులు ఈ మేరకు ఈ అభిప్రాయానికి వచ్చారు.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

    ట్రంప్‌ తరహాలో చైనా విషయంలో బైడెన్‌ దూకుడుగా వెళ్లకపోవచ్చని.. అయితే అమెరికాను తిరిగి అగ్రస్థానాన నిలబెట్టడానికి వీలుగా భారత్‌కు వివిధ రూపాల్లో బాసటగా నిలుస్తారని వారు చెబుతున్నారు. భారత్‌తో సంబంధాలపై 14 ఏళ్ల క్రితమే బైడెన్‌ తన కలను ఆవిష్కరించారు. 2020 నాటికి భారత్‌తో బంధాలు ఏ విధంగా ఉండాలో అప్పట్లోనే వివరించారు. దానిని సాకారం చేసుకునేందుకు ఇప్పుడు ఆయనకు అవకాశం లభిస్తోంది.

    Also Read: అమెరికాలో తీవ్రమైన అల్లర్లు.. ట్రంప్ మద్దతుదారుల దాడులు..

    ‘నా కల ఏమిటంటే 2020లో ప్రపంచంలో రెండు సన్నిహిత దేశాలుగా అమెరికా–భారత్‌ ఉండాలి. అది జరిగితే ప్రపంచం సురక్షితంగా ఉంటుంది’ అని 2006 డిసెంబరులో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది 2020లో సాకారమయ్యే అవకాశాలు లేకపోయినా 2021 జనవరి 20న ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత వీలుంటుంది.

    Also Read: జోబైడెన్ రాకతో హెచ్1బీ ఆంక్షలు రద్దు అవుతాయా?

    ఎన్నికల ప్రచారంలో భాగంగా బైడెన్‌ బృందం విడుదల చేసిన విధాన పత్రంలోనూ భారత్‌తో సంబంధాల గురించి పేర్కొన్నారు. భాగస్వామ్యాన్ని ఒక పద్ధతి ప్రకారం బలోపేతం చేయడం.. ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు పెంచడం.. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై భారత్‌తో కలిసి పనిచేయడం వంటి అంశాలపై ప్రస్తావించారు. ఈ రెండు దేశాలు సహజ భాగస్వాములు అనేది ఆయన పేర్కొన్నారు ‘బాధ్యతాయుత భాగస్వాములుగా భారత్‌–అమెరికా కలిసి పనిచేయకుండా ప్రపంచ సవాళ్లలో ఏ ఒక్కదానినీ పరిష్కరించలేం. భవిష్యత్తులోనూ ఇవి కొనసాగుతాయని’ అని పత్రం తెలిపింది. అంతేకాదు.. ఒబామా–బైడెన్‌ల హయాంలోనే భారత్‌కు భారీ రక్షణ రంగ భాగస్వామి హోదా కూడా లభించింది.