Union Budget 2023: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నిన్న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు.. ఈ సందర్భంగా పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.. బడ్జెట్ అంటే వడ్డింపులు, రాయితీలు సాధారణం.. కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ లో మనకు మన దేశానికి సంబంధించిన కేటాయింపులు మాత్రమే ఉంటాయని తెలుసు.. కానీ చాలామందికి తెలియనిది ఏమిటంటే కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఇతర దేశాలకు ఎంత కేటాయిస్తుందో కూడా చెబుతుంది.. అయితే దీనికి కొన్ని లెక్కలు ఉంటాయి.. ఆసియాలో చైనా తర్వాత భారత్ అతిపెద్ద దేశం.. అయితే పొరుగున ఉన్న దేశాలతో ఎప్పుడూ ముప్పే.. ఈ క్రమంలో ఆయా దేశాలకు మన దేశం సహాయం చేస్తూ ఉంటుంది. ఈ ఏడాది కూడా మన పొరుగున ఉన్న దేశాలకు కేటాయింపులు జరిపింది.

ఆయా దేశాలకు కేటాయింపులు ఇలా
భూటాన్‌కు 2400.58 కోట్లు, నేపాల్‌కు 550 కోట్లు, మారిషస్‌కు 460. 79 కోట్లు మాల్దీవులు మయన్మార్‌లకు చెరో 400 కోట్లు, ఆఫ్రికన్ దేశాలకు 250 కోట్లు, బంగ్లాదేశ్‌కు 200 కోట్లు కేటాయించింది. ఈ బడ్జెట్‌లో విదేశాలకు సహాయం ప్యాకేజీని 5,848.58 కోట్లకు తగ్గించింది. ఆర్థిక మాధ్యం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశానికి సహకరించే దేశాలకే కేటాయింపులు జరుపుతున్నారు.. దీనికి తోడు మన దౌత్య విధానం కూడా మారడంతో దాని ఆధారంగానే కేటాయింపులు జరుగుతున్నాయి.

పొరుగున ఉన్న దేశాలకు కేటాయింపుల వల్ల మనకు లాభం.. ఎందుకంటే చైనా ఇలా పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్, నేపాల్ వంటి దేశాలకు నగదు సహాయం చేస్తుంది.. దీని ఆసరాగా వివిధ ప్రాజెక్టులు నిర్మిస్తుంది.. ఫలితంగా జల, భూ రవాణా మార్గాలలో పెత్తనం చెలాయీస్తూ ఉంటుంది.. దీనివల్ల భారతదేశానికి ఇబ్బంది ఎదురవుతున్నది. ఈ క్రమంలో ఇతర దేశాల నుంచి ముప్పు ఎదుర్కొనేందుకు భారత్ ఈ తరహా విధానానికి శ్రీకారం చుట్టింది.. దీనివల్ల ఆయా దేశాలు మన చెప్పినటు వింటాయి.. ఫలితంగా సరిహద్దుల్లో ఉద్రిక్తత తగ్గుముఖం పడుతుంది.. స్వేచ్ఛా వాణిజ్యానికి దారులు తెరుచుకుంటాయి..