అక్రమాస్తుల కేసులు నిందితుడిగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రస్తుతం తలనొప్పిగా మారింది. ఓ వైపు కేంద్రం నేరచరిత ప్రజాప్రతినిధులపై విచారణ వేగవంతం చేయాలని జగన్ కేసుల విచారణ స్పీడ్ పెరిగింది.దీంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు సీఎం జగన్ కు ఇప్పుడు పెద్ద సమస్యగా మారాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
తాజాగా జగన్‌పై అభియోగాలు మోపిన సీబీఐ, ఈడీ కేసులు వేర్వేరుగా విచారణ జరపాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఈడీ కోరింది. సీబీఐ కేసులతో ఈడీ చార్జ్‌షీట్లకు సంబంధం లేదని ఈడీ తరుపున న్యాయవాది సుబ్బారావు కోర్టుకు నివేదించారు.
Also Read: ఏపీలో పాఠశాలలో కరోనా కలకలం.. టెన్షన్ లో విద్యార్థులు..?
అయితే అంతకుముందు జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలు సీబీఐ, ఈడీ కేసులు సమాంతరంగా లేదా సీబీఐ కేసులు తేలిన తరువాత ఈడీ కేసుల విచారణ మొదలుపెట్టాలని ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అంశంపై పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు ఈడీ న్యాయవాది గడువు కోరడంతో విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. దీంతో అక్రమాస్తుల కేసులో జగన్‌కు ఎటువంటి తీర్పు వస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read: తిరుపతి పార్లమెంట్‌పై ముగ్గురి గురి..!
ఇక జగన్ తరుపున న్యాయవాది నిరంజన్‌రెడ్డి సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు కంపెనీ చట్టాలకు అనుగుణంగానే జరిగాయని, వ్యాపార లాభాల కోసమే పెట్టుబడులు పెట్టారని వాదించారు. ఇందులో మోసపూరితంగా పెట్టుబడులు పెట్టారన్న సీబీఐ చార్జ్‌షీట్‌లో తన పేరును తొలగించాలని జగన్ కోరారు. సీబీఐ, ఈడీ కేసులు వేర్వేరుగా విచారణ జరపాలన్న దానిపై శుక్రవారం విచారణ జరగనుంది. దీనిపై జగన్ వర్గంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.