Janasena: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన రూటు మార్చుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో తెలియాల్సి ఉంది. దీంతో ఆయన వ్యూహమేమిటో అర్థం కావడం లేదు. కేంద్రంలో బీజేపీతో ప్రస్తుతం పొత్తు కొనసాగుతోంది. కానీ ఎక్కడ కూడా కలిసి ఆందోళనలు చేసిన సందర్భాలు లేకపోవడం గమనార్హం.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ రెండు డిమాండ్లు పెట్టనున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో పొత్తు ఖరారైతే ఎంపీ సీట్లపై పేచీ లేకున్నా ఎమ్మెల్యే సీట్లు మాత్రం వంద ఇస్తేనే ఓకే చెబుతానని తెగేసి చెబుతున్నట్లు సమాచారం. టీడీపీతో అయితే 70 సీట్లు కావాలని డిమాండ్ వినిపింనున్నట్లు సమాచారం. దీంతో ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో తేలాల్సి ఉంది. దీనికి పవన్ కల్యాణ్ రెండు పార్టీలకు తాయిలాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ కు అంత సత్తా ఉందా అని అందరిలో అనుమానాలు వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తన ప్రభావం చూపాలని ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీని ఆ దిశగా అడుగులు వేయించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్ జనసేన పార్టీని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాసమస్యలపై స్పందిస్తూ అధికార పార్టీపై పోరు సాగించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతోనే ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో గెలిచిన స్థానాలతో పవన్ కల్యాణ్ లో ధైర్యం పెరిగినట్లు కనిపిస్తోంది.
ఈ పరిస్థితుల్లో జనసేన తన పొత్తు ఎవరితో కొనసాగిస్తుందనేదే ప్రశ్న. అటు బీజేపీతో దోస్తీ కడుతూ ఇటు టీడీపీతో పొత్తుకు తయారు కావడం చూస్తుంటే పవన్ కల్యాణ్ మదిలో ఏముందో అర్థం కావడం లేదు. కానీ బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు మాత్రం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో తేలాల్సి ఉంది.
Also Read: Huzuraba By Election: అయిపాయే..! ఈటల గెలిచే.. ‘కమలం’ వికసించే.. ‘గులాబీ’ వాడిపాయే!