https://oktelugu.com/

హైదరాబాద్ లో స్వచ్ఛంద లాక్ డౌన్..!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేసినప్పుడు కేసుల సంఖ్య సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యేవి. దీంతో కరోనా కట్టడిలోనే ఉందని అంతా భావించారు. అయితే ఇటీవల లాక్డౌన్ సడలింపులు భారీగా ఇవ్వడంతో రాష్ట్రంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గడిచిన వారం పదిరోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తే వైరస్ ఎంతలా విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి చేయిదాటిపోయిందా? అనేలా కరోనా కేసులు నమోదవుతుండటంతో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 26, 2020 / 11:43 AM IST
    Follow us on


    తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేసినప్పుడు కేసుల సంఖ్య సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యేవి. దీంతో కరోనా కట్టడిలోనే ఉందని అంతా భావించారు. అయితే ఇటీవల లాక్డౌన్ సడలింపులు భారీగా ఇవ్వడంతో రాష్ట్రంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గడిచిన వారం పదిరోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తే వైరస్ ఎంతలా విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి చేయిదాటిపోయిందా? అనేలా కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతోన్నారు.

    తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

    ఇక మహానగరం మహమ్మరి గుప్పిట్లోకి వెళ్లినట్లు కన్పిస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు 500పైబడి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్ఎంసీ కార్యాలయ సిబ్బందే కరోనా బారిన పడుతున్నారంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. జీహెచ్ఎంసీ కార్యాలయాలకు ప్రజలెవరూ రావద్దని సూచించింది. ఏవైనా పనులుంటే ఆన్ లైన్లోనే ఫిర్యాదు చేయాలని కోరింది. ఇక జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రాంమ్మోహన్ రెండుసార్లు కరోనా బారి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. దీంతో ఆయన కూడా బయట తిరగకుండా ఇంటి నుంచే పనులను చక్కబెడుతున్నారు.

    ఇదిలా ఉంటే తెలంగాణలో నిన్న ఒక్కరోజే మొత్తం 920కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 737కొత్త కేసులు నమోదవడం గమానార్హం. రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్ జిల్లాలో 60 కొత్త కరోనా కేసులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జీహెచ్ఎంసీలో కరోనా విజృంభిస్తుండటంతో హైదరాబాద్‌ కిరాణ మర్చంట్‌ అసోసియేషన్‌ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. వారంరోజులపాటు బేగంబజార్‌లోని కిరాణా దుకాణాలు స్వచ్చంధంగా మూసివేయనున్నట్లు ప్రకటించారు. ఈనెల 28 నుంచి వచ్చేనెల 5 వరకు బేగంబజార్‌లో దుకాణాలు మూసివేయనున్నారు.

    ఎమర్జెన్సీ చేదు జ్ఞాపకాలకు 45 సంవత్సరాలు

    హైదరాబాద్‌లో కరోనా విజృంభణతో వ్యాపారులు బెంబెలెత్తిపోతున్నారు. దీంతో ఎవరికీవారు స్వచ్ఛంధంగా లాక్డౌన్ విధించుకున్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో చర్చించుకొని లాక్డౌన్ పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం నుంచే వచ్చే నెల 5తేదీ వరకు సికింద్రాబాద్ జనరల్ బజార్, సూర్యా టవర్స్, ప్యారడైజ్ ప్రాంతాల్లోని అన్ని దుకాణాలు మూసి వేయనున్నారు. దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఆదివారం నుంచి మరికొన్ని మార్కెట్లు సైతం లాక్డౌన్ విధించుకునేలా కన్పిస్తున్నాయి.

    మరోవైపు హైదరాబాద్లో చేస్తున్న కరోనా టెస్టులను అర్ధాంతరం నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యంలోనే ప్రజలు స్వచ్చంధంగా లాక్డౌన్ సిద్ధపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు స్వచ్చంధంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. తాజాగా ఇది నగరాలకు కూడా పాకింది. వ్యాపారులతోపాటు ప్రజలంతా ఎవరికీ వారు స్వచ్చంధంగా లాక్డౌన్ పాటిస్తే కరోనా వైరస్ అరికట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.