దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 25న ఓ మహిళ(37) శవం లభ్యమైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. బొల్లారం వైఎస్సార్ కాలనీలో నివాసం ఉండే కురువ స్వామి అలియాస్ రవి (32), మసనమొల్ల నర్సమ్మ (30) ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే నిజాలు వెలుగు చూస్తున్నాయి.
రవి పని లేకుండా జులాయిగా తిరిగేవాడు. దీంతో ఉపాధి లేకపోవడంతో సంఘ విద్రోహ చర్యలకు ఉపక్రమించాలని వ్యూహం పన్నాడు. జీవితం సాఫీగా సాగాలంటే ఆదాయం కావాలని ఆశించాడు. అది కూడా పని లేకుండా ఫ్రీగా రావాలని చూశాడు. దీని కోసం కష్టం లేకుండా వచ్చే మార్గానికి తెర తీశాడు. లేబర్ అడ్డాలు, మార్కెట్ల దగ్గర ఒంటిపై ఆభరణాలతో కనిపించే మహిళలపై దృష్టి పెట్టేవాడు.
వారిని మాటల్లో దింపి సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి పారిపోయేవాడు. ఈ నేపథ్యంలో తొమ్మిదేళ్ల కిందట నర్సమ్మను సైతం ఇలాగే బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్నాడు. ఆమెకు పెళ్లయి పిల్లలున్నా స్వామితో కొద్ది రోజులు సహజీవనం చేశాడు. ఇలా వచ్చిన సొమ్మును తాకట్టు పెట్టి జల్సాలు చేసేవారు. ఎవరికి అనుమానం రాకుండా రెండు మూడు నెలలకోసారి అడ్డాలు మారుస్తూ తిరిగేవారు. ఎంత చాకచక్యంగా వ్యవహరించినా చివరికి ఎక్కడో ఒక్క చోట దొరకక తప్పదని తెలిసినా వారి గుట్టు ఇన్నేళ్లకు పట్టు బడింది. దీంతో విచారణ వేగవంతం చేశారు.