
వీడు మనిషియా? లేక నరరూప రాక్షసుడా? పాములను చూస్తేనే చాలా మంది పైంట్ తడిసిపోద్ది. అలాంటిది బతికున్న పామును మింగితే ఏమన్నా ఉంటుందా? అంతే సంగతులు. ఈ యువకుడు చేసిన జుగుప్సాకరంగా ఉంది. సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకునేందుకు యువత చేయని పనులంటూ లేవు.
తాజాగా హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువకుడు పిచ్చి పరాకాష్టకు చేరింది. వైరల్ కావడం కోసం ఓ బ్రతికున్న పామును తింటూ వీడియో తీశాడు. చిన్న పాము పిల్లను తీసుకొని నోట్లవేసుకొని కరకరా కొరుకుతూ నమిలి మింగాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రాణాలతో ఆ పాము గిలాగిలా కొట్టుకుంటూ కనిపించింది. ఈ చర్యకు పాల్పడిన యువకుడి పేరు సాజిద్ అని తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు అతడి అడ్రస్ లోకేష్ ఇస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
https://twitter.com/FawpsIndia/status/1422774689915539464?s=20