Hijab Controversy: హిందుత్వవాది, బీజేపీ వాది అయితే కేసీఆర్ మాటలు రాంగ్.. కాదు లౌకిక వాది అయితే కరెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హిజాబ్ వివాదంపై కేసీఆర్ మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. హిజాబ్ కు అనుకూలంగా కేసీఆర్ మాట్లాడేశారు. విద్యార్థులు హిజాబ్ వేసుకుంటే ఏంటి? అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు, నేతలు.. విద్యార్థులు, ప్రజలు ఏం కట్టుకోవాలో నిర్ధేశిస్తారా? ఒక్కొక్కొరు ఒక్కో రకమైన దుస్తులు ధరిస్తారని.. ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వాలకు అభ్యంతరం ఏమిటనీ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
ఒకరు లుంగీ కట్టుకుంటారు.. ఇంకొకరు ధోవతి వేసుకుంటారు.. లంగాలు, ఓనీలు, పంజాబీ డ్రెస్ లు… ఎవరు ఏం వేసుకుంటారన్నది ప్రజల ఇష్టం.. వారి ఇష్టానుసారం దుస్తులు ధరించవచ్చు. కానీ దాన్ని కూడా వివాదం చేస్తారా? అని కేసీఆర్ నిలదీశారు. కేసీఆర్ ప్రశ్నలో వాస్తవముంది. అయితే పాటించే జనాల్లో మాత్రం ఆ సెంటిమెంట్ బలంగా నాటుకుపోయింది. మనోభావాల ఇష్యూగా మారిపోయింది.
Also Read: NTR Comments On RRR Movie: అలా ఐతే ‘ఆర్ఆర్ఆర్’ ఒప్పుకునే వాడిని కాదు – ఎన్టీఆర్
దేశానికి ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో హిజాబ్ పంచాయితీ పెట్టారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తొడుక్కునే వస్త్రాలతో ప్రభుత్వాలకు ఏం పని అని ప్రశ్నించారు. మత కలహాలు పెట్టడానికే హిజాబ్ పంచాయితీపెట్టారని కేసీఆర్ విమర్శించారు. హిజాబ్ లాంటి సమస్యలు, మతకలహాలు ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఇలాంటి వివాదల వల్ల దేశ యువత భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు. బీజేపీ సంకుచిత వ్యవహారాలు చేస్తోందన్నారు.
నిజానికి ఆది నుంచి బీజేపీ రాజకీయాలు అంతా హిందుత్వ మీదనే సాగుతున్నాయి. కాంగ్రెస్ సెక్యూలర్ పాలనలో వివక్షకు గురైన హిందువులంతా మైనార్టీల చర్యలతో అంతో ఇంతో ఇబ్బందులు పడ్డారు. నాడు మైనార్టీదే నడిచింది. హిందువుల సిద్ధాంతాలు అంతగా పాటింపబడలేదు. అందుకే వారి మనోభావాలలోంచే బీజేపీ బలంగా తయారైంది. ప్రజలందరూ ఓన్ చేసుకున్నారు కాబట్టే ఇప్పుడు అది ప్రబల శక్తిగా మారింది. ప్రజల సెంటిమెంట్ ను ఎవరూ కాదనలేరు. అదే సమయంలో మైనార్టీల భావనలు, భక్తులను అడ్డుచెప్పడం కరెక్ట్ కాదు. కానీ అది అందరూ చదువుకునే విద్యాసంస్థల్లో అమలు చేయాలనడం సరికాదని హైకోర్టుయే తీర్పునిచ్చింది. ఇప్పటికైనా ఈ వివాదాన్ని ఇరువర్గాలు వదిలేస్తే మంచిది.
Also Read: Hero Prabhas: మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్