High Court Stay On NTR Statue: ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు చెక్.. షాకిచ్చిన హైకోర్టు

ఖమ్మం జిల్లాలో ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువగా ఉన్నారు. దీంతో పర్యాటకులను ఆకర్షించే విధంగా లకారం చెరువులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే సినిమాల్లో శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు.

Written By: Chai Muchhata, Updated On : May 26, 2023 2:54 pm

High Court Stay On NTR Statue

Follow us on

High Court Stay On NTR Statue: ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు మరోసారి వాయిదా పడినట్లే తెలుస్తోంది. మే నెల 28న ఖమ్మంలోని లకారం చెరువులో ఏర్పాటు చేయాలనుకున్న విగ్రహ ఏర్పాటుపై యాదవ సంఘాలు అభ్యంతరం చెప్పాయి. అంతేకాకుండా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను స్వీకరించిన ధర్మాసనం గురువారం విచారించింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు విచారణనను జూన్ 6కు వాయిదా వేసింది. దీంతో ఈనెల 28న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తారా? లేదా? అనేది సస్పెన్ష్ గా మారింది.

ఖమ్మం జిల్లాలో ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువగా ఉన్నారు. దీంతో పర్యాటకులను ఆకర్షించే విధంగా లకారం చెరువులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే సినిమాల్లో శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. దీంతో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే కొన్ని యాదవ సంఘాలు తమ కులం దైవం శ్రీకృష్ణుడిని ఎన్టీఆర్ రూపంలో చూపించడానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ అంటే తమకు అభిమానమేనని కానీ ఆయనను శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయడాన్ని ఒప్పుకోమని అన్నారు.

ఈ మేరకు యాదవ సంఘాలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు గురువారం జరిగిన వాదనల్లో పిటిషినర్ తరుపున న్యాయవాది వాదిస్తూ.. బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ నేతల విగ్రహాల ఏర్పాటు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమన్నారు. ఆయన వాదనకు ప్రతిగా ప్రభుత్వం తరఫున ఏజే రామచంద్రరావు వాదనను వినిపిస్తూ ఎన్టీఆర్ విగ్రహం లోని పిల్లనగ్రోవి పింఛన్ తొలగించామని అన్నారు. అంతేకాకుండా ‘తానా’ ఆధ్వర్యంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయా? అని ప్రశ్నించింది. దీంతో అడ్వకేట్ జనరల్ వాటిని కోర్టుకు సమర్పించారు. అయితే విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న వారి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది వాదిస్తూ.. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పబ్లిక్ ప్లేస్ లో విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదన్నారు. లేక్ వద్ద అనుమతి ఇస్తే చెరువు మధ్యలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలనుకుంటే ఆయన ధరించిన వేరే పాత్రల రూపంలో పెట్టుకోవచ్చు.. అలా కాకుండా దేవుడి రూపంలో ఉన్న విగ్రహం పెట్టడం ఎందుకు? అని పిటిషనర్ తరఫున న్యాయవాదులు వాదించారు

ఈ సమయంలో జోక్యం చేసుకున్న ఏజీ రామచంద్రరావు శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో నటించారు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు విగ్రహం ఏర్పాటు చేస్తే ఎందుకని ప్రశ్నించారు. శ్రీకృష్ణుడు ఏ ఒక్క కులానికి మాత్రమే దేవుడు కాదని, ప్రపంచ మొత్తానికి దైవమని అన్నారు. అయితే న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో జూన్ 6న దీనిపై విచారించనున్నారు. మరి ఈనెల 28న ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.