https://oktelugu.com/

భారీ వర్షాలపై కేసీఆర్ అలర్ట్

తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ మేరకు ఆయన సమీక్ష నిర్వహించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ నుంచి గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతున్నందున ముందస్తు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గంతోపాటు నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి తక్షణమేసహాయం అందించాలని ఆదేశించారు. అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఆదేశించారు. వర్షాల కారణంగా ప్రజలు బయటకు రావద్దని […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 22, 2021 6:24 pm
    Follow us on

    CM KCRతెలంగాణలో భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ మేరకు ఆయన సమీక్ష నిర్వహించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ నుంచి గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతున్నందున ముందస్తు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గంతోపాటు నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి తక్షణమేసహాయం అందించాలని ఆదేశించారు. అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఆదేశించారు.

    వర్షాల కారణంగా ప్రజలు బయటకు రావద్దని సూచిస్తున్నారు. వాగులు, వంకలు అన్ని పొంగిపొర్లుతున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రాష్ర్టంలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తే పరిస్థితులు వస్తున్నాయన్నారు. దీంతో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. వరద ప్రవాహం పెరిగే నేపథ్యంలో ప్రమాదకరంగా మారిన వాగులు దాటేందుకు సాహసం చేయొద్దన్నారు.

    గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పరిధిలో ఉంటూ వరద పరిస్థితిని సమీక్షించాలన్నారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ పరిస్థితులను గమనించాలని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులకు కరువుతీరా వానలు పడుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. సాగుకు ఢోకా ఉండదని ధీమా వ్యక్తం చేశారు.

    నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా విధులు నిర్వహించాలన్నారు. రానున్న రెండు రోజుల్లో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారన్నారు. ప్రజల అప్రమత్తతపై అందరు జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు.