Rain Alert: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఒరిస్సా నుంచి బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అతి నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దీంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది.

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని తెలుస్తోంది. దీంతో అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయని చెబుతున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు పడే ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని చెబుతున్నారు. దీనిపై అధికార యంత్రాంగాన్ని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్నారు.
Also Read: Ponniyin Selvan: సౌత్ సినిమాకి రేపు పండగే.. భారీ మల్టీస్టారర్ గ్లింప్స్ రెడీ
తెలంగాణలోని కొమురం భీం అసిఫాబాద్, ములుగు, వరంగల్ అర్బన్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, జనగామ, సిద్దిపేట తదితర జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. దీంతో రాబోయే మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు చెబుతున్నారు. వాతావరణ శాఖ చెబుతున్న సూచనల నేపథ్యంలో అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో వరద ప్రభావం ఉండటంతో జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలు ఏైనా ప్రమాదం ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు.

వాతావరణ శాఖ సూచనలతో అధికారులందరు సెలవులు పెట్టొద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. నగరంలో వర్షం పడితే నాలాలు పొంగే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో చెప్పలేం. అందుకే అధికార యంత్రాంగం నిత్యం అందుబాటులో ఉండాలని చెబుతున్నారు. వర్షాల ప్రభావంతో కలిగే నష్టాలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Also Read:Pavitra Lokesh- Suchendra: పవిత్ర లోకేష్ గురించి మరో సంచలన నిజాన్ని బయటపెట్టిన ఆమె భర్త