Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీరకణలు మారబోతున్నాయి. జనసేన ప్రధా పార్టీగా గుర్తించేందుకు నేతలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీనికి గాను పొత్తుల వ్యవహారంలో కీలకంగా మారనుంది. ఇన్నాళ్లు బీజేపీతో జతకట్టినా త్వరలో దానితో తెగదెంపులు చేసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఇందుకు గాను పలు వ్యూహాలు ఖరారు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి ప్రధాన కారణం నాదెండ్ల మనోహర్ అని పార్టీలో పలు కోణాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

పవన్ కల్యాణ్ ఆలోచనల్లో కూడా భారీ మార్పులు వస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీని రాష్ర్టంలో విస్తరింపజేయాలని చూస్తున్నారు. ఇందుకు చేపట్టబోయే వ్యూహాలపై పదును పెడుతున్నారు. పార్టీని గాడిలో పెట్టే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ అధికారానికి దూరమైనా ఆర్థిక కష్టాలతోనే అనే విషయంపై చర్చ జరిగింది. ఇఫ్పటికే పవన్ కల్యాణ్ ఆర్థిక లోటును పూడ్చుకునే క్రమంలో సినిమాలు చేసేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. దీనికి నాదెండ్ల మనోహర్ పవన్ కల్యాణ్ మైండ్ సెట్ ను మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. భవిష్యత్ లో జనసేన ఏపీలో అధికారంలోకి రావాలన్నదే లక్ష్యంగా ఆలోచనలో పడ్డారు. దీనికి గాను అయితే టీడీపీతో జత కడితే కలిగే లాభాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీలోకి పలువురు నేతలను కూడా ఆహ్వానించడానికి రెడీ అయినట్లు చెబుతున్నారు.
Also Read: Telugu Actors: టాలీవుడ్ టాప్ 10 హీరోల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
మరో ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉంటే ఏర్పడే పరిణామాలపై నేతల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని తద్వారా అధికారం చేపట్టాలని పలు కోణాల్లో ఆలోచనలు చేస్తోంది. దీంతోనే టీడీపీతో పొత్తుకు నాదెండ్ల మనోహర్ పలు ప్రణాళికలు రచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: TPCC Revanth Reddy: రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చిందా?