Harish Rao- Sri Reddy: తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న మరో మంత్రి తన్నీరు హరీశ్‌రావు. సీఎం కేసీఆర్‌కు మెనల్లుడు అయిన హరీశ్‌రావు ప్రస్తుతం ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ చూసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా హరీశ్‌రావుకు గుర్తింపు ఉంది. బీఆర్‌ఎస్ పార్టీలో ఆయనకంటూ ప్రత్యేక కోరటీ కూడా ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో సిద్దిపేటలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం ద్వారా ఉద్యమం ఆత్మబదిలిదానాలవైపు మళ్లింది. హరీశ్‌రావు చేసిన ఆత్మహత్యాయత్నం ఘటన తర్వాత వందల మంది బడగు, బలహీనవర్గాల యువకులు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో హరీశ్‌రావు చాలా ఫేమస అయ్యాడు. తెలంగాణ వచ్చాక రెండు పర్యాయాలు మంత్రి కూడా అయ్యాడు. అభివృద్ధిలో తన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిద్దిన హరీశ్‌రావు ఇటీవల తెలుగు నటి శ్రీరెడ్డికి చిక్కారు. ఆంధ్రా ప్రజలు, ఓటర్లు, పాలకుల గురించి హరీశ్‌రావు ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. దీంతో శ్రీరెడ్డి హరీశ్‌రావును ఓ ఆటాడుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హరీశ్‌రావు ఏమన్నాడంటే..
ఆంధ్రాకు, తెలంగాణకు జమీన్ ఆస్మాన్ పరాక్ ఉందని, పండుగలకు వెళ్లినప్పుడు అక్కడి రోడ్లు, కరెంటు పరస్థితి ఏంటో చూస్తున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధిలో భాగమయ్యే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే అని కేసీఆర్ మాటలను గుర్తు చేశాడు. తెలంగాణలో ఉన్న ఆంధ్రుల అభివృద్ధికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రకటించాడు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చాడు.
శ్రీరెడ్డి సెటైర్లు..
హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై శ్రీరెడ్డి సెటైర్లు విసిరారు. ఇప్పుడు ఆంధ్రులు, ఆంధ్రుల ఓట్లు గుర్తొచ్చాయా హరీశ్‌రావు అని నిలదీసింది. ఆంధ్రా బాగాలేదని ఆంధ్రులంతా తెలంగాణకు రావాలనా అని ప్రశ్నించింది. ఇక్కడి వచ్చి.. ఓట్లు తెలంగాణకు మార్చుకుని మీకు గుద్దెయాల అని అడిగింది. అసలు ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ఆంధ్రుల గురించి మాట్లాడుతున్నారని నిలదీసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రులను తెలంగాణ నుంచి వెళ్లగొడతామన్నవారు ఇప్పుడు ఆంధ్రులు రావాలని అడగడం ఏంటని ప్రశ్నించింది. ఆంధ్రులపై మీరు చేసిన వ్యాఖ్యల వీడియోలన్నీ తన వద్ద ఉన్నాయని రెండు మూడు రోజుల్లో వాటిని పోస్టు చేస్తానని ప్రకటించింది.
కర్రీపాయింట్లు పెట్టుకోవాడికే అన్నావ్ కదా..
నాడు ఆంధ్రులు తెలంగాణలో కర్రీపాయింట్లు పెట్టుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరారని అన్న మాటను శ్రీరెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఆంధ్రా విభజన తర్వాత కూడా ఏపీకి అన్యాయం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, మంత్రులు, నీటివాటాలు తేచ్చని నేతలు ఇప్పుడు ఆంధ్రా నుంచి వచ్చేయండని ఎలా అడుగుతారని నిలదీసింది. ఆంధ్రుల సపోర్టు లేకుండా అసలు హైదరాబాద్ ఇంత డెవలప్ అయ్యేదా అని ప్రశ్నించింది. సంక్రాంతి సెలవులు వస్తే రోడ్లపై ఒక్కరు కనిపించరు. అంటే హైదరాబాద్‌లో ఆంధ్రుల పెట్టుబడి ఎంత ఉందో అర్థం చేసుకోవాలని సూచించింది. ఆంధ్రులను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ కూడా ఇచ్చింది శ్రీరెడ్డి. ఎవరి లిమిట్స్‌లో వారు ఉండడం మంచిదని సూచించింది.
హరీశ్‌రావుకు వార్నింగ్ ఇచ్చిన శ్రీరెడ్డి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు హరీశ్‌రావు అభిమానులు, ఇటు ఆంధ్రులు కామెంట్స్ పెడుతున్నారు.