
MLA Rajaiah harassing women sarpanch: ఎమ్మెల్యే రాజయ్య ఎప్పుడు వివాదాల్లో నిలుస్తుంటాడు. ఎప్పుడు తన నోటిదులతో ఏదో ఒకటి మాట్లాడే రాజయ్య ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యారు. ఓ మహిళా సర్పంచ్ తనను వేధిస్తున్నారని చేసిన ఆరోపణలపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై మహిళా కమిషన్ కు సైతం మొరపెట్టుకుంది. తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతోంది. రాజయ్య తనపై చేసిన వ్యాఖ్యలకు తన వద్ద ఫోన్ రికార్డింగులు కూడా ఉన్నాయని వెల్లడిస్తోంది. దీంతో రాజయ్య అడ్డంగా దొరికిపోయాడు. మహిళా కమిషన్ సైతం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో భవిష్యత్ పరిణామాలపై కంగారు పట్టుకుంది.
ఏమిటీ రాజయ్య నైజం?
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదట ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యపై ఇలాంటి ఆరోపణలు రావడం వల్లే ఆ పదవి నుంచి తొలగించారు. ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన ఎప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటారు. మద్యం సేవించిన ప్రతి సారి ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం ఆయన నైజం. గతంలో ఆయన నియోజకవర్గంలో తన తమ్ముడికి దళితబంధు ఇప్పించినట్లు వార్తలు వచ్చాయి. అంతకుముందు కూడా కొన్ని పొరపాట్లు చేశారు. ఇలా ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉండటం ఆయనకు అలవాటే.
ఇప్పుడేం జరిగింది?
ఓ మహిళా సర్పంచిని కొద్ది రోజులుగా వేధిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యే తనను ఒంటరిగా రమ్మంటున్నాడని ఆమె కన్నీటి పర్యంతమైంది. దీనిపై ఆయన స్పందిస్తూ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలపై మహిళలు మన్నించాలన్నారు. నా వల్ల మహిళలకు అన్యాయం జరిగి ఉంటే క్షమించాలని వేడుకున్నారు. నియోజకవర్గానికి తన వంతు కృషి చేస్తానన్నారు. జానకీపూర్ అభివృద్ధికి తక్షణమే రూ. 25 లక్షలు మంజూరు చేస్తున్నానన్నారు.
ప్రవీణ్ చూసే..
నేను ప్రవీణ్ ను చూసే సర్పంచ్ టికెట్ ఇచ్చాను. అతని భార్య నవ్య నాకు తెలియదు. కానీ నాపై ఆరోపణలు చేస్తోంది. అవన్నీ నిరాధారాలే అని నిరూపణ అవుతుంది. ఇందులో నా తప్పు ఏమీ లేదు. దీనికి నేను బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. అయినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నిజానిజాలు త్వరలో తెలుస్తాయి. ఎందుకు మనం తొందరపడాలి. తప్పు చేసిన వారే భయపడాలి. ఏ తప్పు చేయని నాకు ఎందుకు భయం అని వ్యాఖ్యానించారు. దీంతో మరోవైపు మహిళా కమిషన్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో రాజయ్య భవితవ్యం ఏమిటో తెలియం లేదు అని పలువురు రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
తప్పు ఒప్పుకున్నట్లేనా?
సర్పంచ్ నవ్యకు క్షమాపణలు చెప్పిన రాజయ్య వ్యవహారం ఎక్కడకు వెళ్తుందోననే అనుమానాలు వస్తున్నాయి. ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పినందున తప్పు ఒప్పుకున్నట్లేనా? ఇక మీదటనైనా రాజయ్య తప్పుడు పనులు చేయకుండా ఉంటారా అనే సంశయాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. కుక్క తోక వంకర అన్న చందంగా ప్రతిసారి వివాదాల్లో చిక్కడం ఆయనకు తరచు అలవాటుగానే మారుతోంది. దీనిపై ఎవరెన్ని చెప్పిన ఆయన గుణంలో మార్పు రావాల్సి ఉంటుంది.
