Homeజాతీయ వార్తలుGST Council Tilts Towards Rate Hikes: మోడీ బాదుడు: ఆఖరుకు పెరుగు, మాంసాన్ని కూడా...

GST Council Tilts Towards Rate Hikes: మోడీ బాదుడు: ఆఖరుకు పెరుగు, మాంసాన్ని కూడా వదలవా?

GST Council Tilts Towards Rate Hikes: ఒక చేత్తో పెట్టి.. ఇంకో చేత్తో లాక్కోవడం ప్రధాని మోదీకి ‘జీఎస్టీ’ తో పెట్టిన విద్య. ఏ ముహూర్తాన దేశంలో జీఎస్టీ పేరుతో పన్నుల వ్యవస్థను తీసుకొచ్చారో.. అప్పుడే ప్రతి వస్తువు పన్ను జాబితాలో చేరింది. అప్పటిదాకా రకరకాల ట్యాక్స్ ల పేరుతో ఖజానా నింపుకొనే రాష్ట్రాల అధికారాలకు కత్తెర పడింది. పన్ను వసూలు, కేటాయింపుల బాధ్యత కేంద్రం తీసుకుంది. కేవలం రెవెన్యూ, అబ్కారీ, స్టాంపు డ్యూటీ, సి నరేజీ మాత్రమే రాష్ట్రాలకు అప్పగించింది. ఇక ఇప్పటినుంచి రాష్ట్రాల కష్టాలు మొదలయ్యాయి. అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు ఇచ్చిన పార్టీలు.. వాటిని అమలు చేసేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో తొలి అయిదేళ్ళు ప్రభుత్వాలకు పరిహారం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆ గడువు కూడా ముగియ బోతోంది.

GST Council Tilts Towards Rate Hikes
GST Council

దేన్నీ వదలడం లేదు

మొన్నటిదాకా గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలను ఇష్టానుసారంగా పెంచిన కేంద్ర ప్రభుత్వం.. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దిగుమతి సుంకాలను తగ్గించింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమాంతం పెరిగిన పామాయిల్, పొద్దుతిరుగుడు నూనెల పై సుంకాలను తగ్గించింది. ధరలు తగ్గాయని సంతోషించే లోపే ఇతర నిత్యావసర లపై జీఎస్టీ విధించాలని కౌన్సిల్లో తీర్మానించడం గమనార్హం.

Also Read: AP Employees PF Money: ఆ లెక్క సరిచేసేందుకు ‘జీపీఎఫ్’ నగదు మాయం.. ఉద్యోగుల్లో కలవరం

పాలు, పెరుగు, మాంసం పై..

ఇప్పటిదాకా పాలు, పెరుగు, మాంసం ఇతరత్రా వస్తువులపై జీఎఎస్టీ లేదు. కానీ తాజాగా జరిగిన కౌన్సిల్ భేటీలో వీటిపై జీఎస్టీ విధించాలని నిర్ణయించారు. దేశంలో సాలీనా ₹ రెండు లక్షల కోట్ల పాల వ్యాపారం జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో లెక్కలోకి రాదు కాబట్టి అది కూడా దాదాపు ఒక పది వేల కోట్ల వరకు ఉండొచ్చు. ఇక వ్యవసాయరంగ అనుబంధ పరిశ్రమల్లోకి విదేశీ కంపెనీలు భారీగానే పెట్టుబడులు పెడుతున్నాయి. ఇందులో భాగంగానే మాంసాన్ని ప్రాసెస్ చేసి వినియోగదారులకు అందించే సంస్థలు పుట్టుకొచ్చాయి. దేశంలో “టెండర్ రూట్స్, హ్యాపీ మీట్, ప్రెష్ టు హోం” వంటి సంస్థలు మాంసం వ్యాపారంలో దిగ్గజాలుగా ఉన్నాయి. ప్రజలు తప్పనిసరిగా పై వస్తువులను కొనుగోలు చేస్తారు కాబట్టి వాటిపై ఐదు శాతం జీఎస్టీ విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.

ఆసుపత్రి సేవలు ఖరీదు

కొవిడ్ వల్ల మనిషికి ఆరోగ్య స్పృహ పెరిగింది. ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ ఆరోగ్య సంరక్షణ కోసం కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించేందుకు ఎవరూ వెనుకాడటం లేదు. ఇప్పటిదాకా ఆసుపత్రిలో గదులను వినియోగించే రోగులపై ఎటువంటి జీఎస్టీ విధించలేదు. అని ఇకనుంచి ఇన్ పేషెంట్గా చేరే వారు, రోజ జూ ₹5వేలకు పైగా అద్దె చెల్లించే స్థోమత ఉన్నవారి పై జీఎస్టీ విధించే అవకాశం ఉంది. ఇవే కాకుండా పిల్లలు వాడే అట్లాస్, చార్టుల పై జీఎస్టీ విధించే అవకాశం ఉంది.

GST Council Tilts Towards Rate Hikes
GST Council

వీటిపైనే ఎందుకు?

ఎంత కాదనుకున్నా కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు పెట్రోల్ డీజిల్ పై విధించే సుంకాలు. అంతటి కోవిడ్ సమయంలోనూ పెట్రోల్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం ఎడాపెడా సుంకాలు విధించింది. బ్యారెల్ చమురు ధర తగ్గినా కూడా భారతదేశంలో మాత్రం పన్నులు ఎడాపెడా పెరిగాయి. కేవలం సుంకాల ద్వారా అప్పట్లోనే దాదాపు ₹లక్షా యాభై వేల కోట్లను కేంద్రం తన ఖజానాలో జమ చేసుకుంది. ఈ నగదును వ్యాక్సిన్ తయారీ కోసం ఉపయోగించామని కేంద్రం చెబుతున్న ప్రతిపక్షాలు కొట్టి పారేస్తున్నాయి. మరోవైపు పెట్రోల్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరిగింది. దీనికితోడు వంటనూనెల ధరలు కూడా సలసలా కాగడంతో సామాన్యుడు బతక లేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇంటా బయట విమర్శలు రావడంతో కేంద్రం ఆయా ఉత్పత్తుల పై దిగుమతి సుంకాలు తగ్గించింది. కానీ ఇప్పటివరకు అత్యంత వినిమయ వస్తువులుగా ఉన్న పాలు, పెరుగు, ప్రాసెస్ చేసిన వెన్న, మాంసం వంటి వాటి జోలికి వెళ్లలేదు. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం కమ్ముకోవడం, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడం, ప్రభుత్వ వ్యయం అంతకంతకు పెరుగుతుండటంతో ఆ లోటును పూడ్చుకునేందుకు ప్రభుత్వం ఈ బాట పట్టింది. వీటి ద్వారా కోపం ఎంత లేదన్నా ₹1.50 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. ఎలాగు జీఎస్టీ పరిధిలోకి రావటంతో పాలు,పెరుగు, మాంసం రంగాల్లోకి పెట్టుబడులను ఆహ్వానిస్తోంది.

Also Read:YCP Politics: వైసీపీలో ‘కుట్ర’ కోణాలు..! సంచలన అడజడులు

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular