Homeజాతీయ వార్తలుGovernor Tamilisai Vs KCR: ఆర్టీసీ బిల్లుపై కేసీఆర్ సర్కార్ కు గవర్నర్ షాక్!

Governor Tamilisai Vs KCR: ఆర్టీసీ బిల్లుపై కేసీఆర్ సర్కార్ కు గవర్నర్ షాక్!

Governor Tamilisai Vs KCR: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుపై తెలంగాణ రాజ్ భవన్ అధికారులు స్పందించారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 2న మధ్యాహ్నం 3.30కి ఆర్టీసీ బిల్లు రాజ్‌భవన్‌కు వచ్చిందని తెలిపారు. అయితే ఈ బిల్లుపై లీగల్‌ ఒపీనియన్‌ తీసుకోడానికి కొంత సమయం పడుతుందన్నారు. లీగల్ ఒపీనియన్ తర్వాతే బిల్లును గవర్నర్‌ పరిశీలిస్తారని పేర్కొన్నారు. అందుకు కొంత టైం పడుతుందని రాజ్‌ భవన్‌ అధికారులు చెప్పుకొచ్చారు.

రాజ్‌భవన్‌ ముట్టడి యోచన..
ఇదిలా ఉంటే గవర్నర్‌ ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపని నేపథ్యంలో ఛలో రాజ్‌భవన్‌కు పిలుపు ఇవ్వాలని కార్మికులు ఆలోచిస్తున్నారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలను రద్దు చేసిన నేపథ్యంలో పాత సంఘం నాయకులు దీనిపై చర్చిస్తున్నారు. సంఘంగా పిలుపునిస్తే తర్వాత తలెత్తే పరిణామాలతో ఇబ్బంది పడాల్సి వస్తుందని, కేసులు పెడితే విలీనం సంగతి ఏమో కానీ, ఉద్యోగానికి ఎసరు వస్తుందని భావిస్తున్నట్లు సమాచాం. అయితే దీనిపై ఇవాళ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజ్‌భవన్‌ నుంచి ఈ బిల్లుపై రిప్లయ్‌ రావడంతో కార్మిక సంఘాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

24 గంటల్లో కావాలట..
గవర్నర్‌కు రాజ్యాంగపరంగా అధికారాలు ఉన్నాయి. నోట్‌ను, బిల్లును తిప్పి పంపే అధికారం కూడా గవర్నర్‌కు ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వం సమావేశాల ప్రారంభం రోజు నోట్‌ పంపి 24 గంటల్లో సంతకం చేసి ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు ఉంది. విలీన ప్రక్రియ అనేది న్యాయపరమైన అంశం. బిల్లు పాస్‌ అయిన తర్వాత కూడా కార్మికులు ఇబ్బంది పడకుండా ఉండాలి. అందుకోసం లీగల్‌ ఓపినియన్‌ తప్పనిసరి. ఈ పరిస్థితిలో 24 గంటల్లో సంతకం చేయాలని రాజ్‌భవన్‌పై కూడా పెత్తనం చెలాయించినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాలుగేళ్ల క్రితం అసంభవం అని, ఇప్పుడు ఓట్ల కోసం నిర్ణయం తీసుకోవడం.. అంతే వేగంగా రాజ్‌భవన్‌ ఆమోదించాలనడం సబబు కాదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. హడావుడిగా ఆమోదం తెలిపితే తర్వాత న్యాయూపరమైన చిక్కులు ఎదురవుతాయని అంటున్నారు.

కావాలనే కాలయాపన..
ఇదిలా ఉంటే.. గవర్నర్‌ వైఖరిపై ప్రభుత్వం నోట్‌ విడుదల చేసింది.
బిల్లుపై తన అభిప్రాయాన్ని చెప్పకుండా కావాలనే కాలయాపన చేస్తున్నట్లు పేర్కొంది. గవర్నర్‌ వైఖరీ చూస్తుంటే ప్రభుత్వంపై వ్యతిరేక ధోరణితో మిగతా బిల్లులను ఆపినట్లే ఆర్టీసి బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆపి ఇటు ప్రభుత్వాన్ని, అటు ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టాలనే దురద్దేశం స్పష్టం అవుతున్నదని తెలిపింది. ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్న గవర్నర్‌ వైఖరి ఆర్టీసీ బిల్లు విషయంలో అనుసరిస్తున్న తాత్సార వైఖరి మరిన్ని బడుగు బలహీన వర్గాలు, పేదలే అధికంగా వున్న ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు మరిన్ని ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉందని ప్రభుత్వం వివరించింది. ప్రత్యామ్నాయం గురించి సీఎం ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలిపింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular