Public Properties: ప్రభుత్వాలు ఆస్తులను (Government assets) అమ్ముకుని లబ్ధి పొందాలని భావిస్తున్నాయి. దీంతో తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) స్టేట్లు తమ ఆధీనంలో ఉన్న ఆస్తులను అమ్మి తత్వారా ప్రగతిపనులు చేపట్టాలని భావిస్తున్నాయి. తెలంగాణలోని ప్రభుత్వం భూములు అమ్మి దళితబంధు పథకంలో పెడతామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించడంతో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇలా ఉన్న ఆస్తుల్ని అమ్ముకుంటూ పోతే భవిష్యత్ లో మన కోసం ఏం ఉంటాయని అందరిలో ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ విధానాలపై బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం సైతం ప్రజా ఆస్తులను అమ్మాలని యోచిస్తోంది. ఇందులో జీవిత బీమా సంస్థ, రైల్వేలు, రహదారులు, పోర్టులు, విశాఖ స్టీల్ ప్లాంట్ తదితర సంస్థలను అమ్మి వచ్చే డబ్బుతో పలు కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది. దీనిపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయంలో అడ్వాన్స్ గా ఆలోచనలు చేస్తోంది. ప్రభుత్వానికి ఆదాయం సమకూరేందుకు ఆస్తులను అమ్మాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. నగదు సమకూర్చుకునే క్రమంలో ప్రభుత్వం పలు ఉపాయాలు పన్నుతోంది.
ఆంధ్రప్రదేశ్ మాత్రం అప్పుల ఊబిలో చిక్కుకుపోయింది. రోజువారీ నిర్వహణ కష్టంగా మారినట్లు తెలుస్తోంది. దీంతో ఏపీ సైతం ప్రభుత్వ ఆస్తులను అమ్మేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎక్కువగా ఆదాయం వచ్చే వాటిపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది. యథేచ్ఛగా స్థలాల విక్రయాలు చేస్తుంది. ప్రభుత్వ ఆస్తులు ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండడంతో ఏపీకి కలిసి రావడం లేదు. తెలంగాణకే మేలు జరుగుతోంది. దీంతో సంక్షోభంలో ఉన్న ఏపీకి చిక్కులే ఎదురవుతున్నాయి.
ప్రభుత్వాలు ప్రజా ఆస్తులను అమ్మేయడంపై మేధావుల నుంచి విమర్శలు సైతం వస్తున్నాయి. భావితరాలకు సాక్ష్యంగా ఉండాల్సిన వాటిని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆస్తులను అమ్మి లబ్ధి పొందాలని భావించడం పిచ్చి చర్యే. దీంతో ప్రభుత్వాల తీరుతో ప్రజాధనం వృథా అయిపోతుందనే భయం అందరిలో పట్టుకుంది. ఇప్పుడే ఇలా అమ్మకుంటూ పోతే రాబోయే తరాలకు ఏమి మిగులుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాల నిర్ణయం వల్ల నష్టమే జరుగుతుందని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ప్రజా ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని భావిస్తున్నారు.