ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా అంతకంతకూ పెరుగుతోంటే మరికొన్ని దేశాల్లో మాత్రం విచిత్రంగా జనాభా అంతకంతకూ తగ్గుతోంది. భారత్ లో జనాభా ఏడాదికేడాదికి పెరుగుతుండగా జపాన్ లో మాత్రం జనాభా అంతకంతకూ తగ్గుతుండటం గమనార్హం. పని చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపే జపాన్ లోని జనాభాలో వృద్ధులే అధికంగా ఉన్నారు. ఆ దేశ యువత పెళ్లి చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
Also Read: ఒకే వేదికపై ముగ్గురు కవల సోదరీమణులకు వివాహం.. ఎక్కడంటే..?
సాధారణంగానే జపాన్ యువతకు పెళ్లిపై ఆసక్తి తక్కువ కాగా కరోనా, లాక్ డౌన్ వల్ల అక్కడి యువత పెళ్లి పట్ల అస్సలు ఆసక్తి చూపడం లేదు. జపాన్ ప్రభుత్వం దేశంలోని జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో కొత్త పథకాలను అమలు చేయడంతో పాటు కీలకా నిర్ణయాలను తీసుకుంటోంది. ప్రభుత్వం సూచనల మేరకు జపాన్ లోని పలు కంపెనీలు ఉద్యోగులకు తక్కువ పనిగంటలు అందుబాటులో ఉన్నా సరిపోతుందని సూచిస్తున్నాయి.
ఎవరైనా ఈ నిబంధనలను పాటించకపోతే వారిని కొంతకాలం పాటు విధులను దూరం చేస్తూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని గుర్తు చేస్తున్నాయి. గతేడాది జపాన్ లో జననాల సంఖ్య కేవలం 8.65 లక్షలు మాత్రమే అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో సులభంగానే అర్థమవుతుంది. జననాల రేటు పెంచాలనే ఉద్దేశంతో జపాన్ ప్రభుత్వం పెళ్లి చేసుకునే జంటలకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి.
Also Read: డూప్ భార్యతో ట్రంప్ ప్రచారం.. దుమారం
ప్రభుత్వం నుంచి ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. 2021 ఏప్రిల్ నుంచి పెళ్లి చేసుకునే జంటలకు భారత కరెన్సీ ప్రకారం 4 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం చెల్లిస్తామని ప్రకటన వెలువడింది. ఈ నిర్ణయం అమలు వల్ల జననాల రేటు పెరుగుతుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. 40 ఏళ్లు మించని వధువు, వరుడు రిజిష్టర్ చేసుకుని ఈ స్కీమ్ కు అర్హులు కావచ్చు.