Homeఆంధ్రప్రదేశ్‌Minister Gudivada Amarnath: విశాఖ నుంచి పాల‌న‌.. ఏపీ మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న

Minister Gudivada Amarnath: విశాఖ నుంచి పాల‌న‌.. ఏపీ మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న

Minister Gudivada Amarnath: రెండు నెల‌ల్లో విశాఖ ప‌రిపాల‌న రాజ‌ధాని కాబోతోంది. సీఎం విశాఖ నుంచి ప‌రిపాల‌న చేస్తారు. ఇవి ఏపీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ వ్యాఖ్య‌లు. మూడు రాజ‌ధానుల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గ‌ద‌ని ప‌రోక్షంగా చెప్పారు. రాజ‌ధాని వ్య‌వ‌హారం కోర్టులో ఉన్న‌ప్ప‌టీకీ.. ప్ర‌త్యామ్నాయ అవ‌కాశాల కోసం ప్ర‌భుత్వం వెతుకుతోంద‌ని స్పష్టం అవుతోంది. ఈ నేప‌థ్యంలో విశాఖ నుంచి పాల‌న మొద‌లవుతుందా ? లేదా కోర్టు నుంచి అడ్డంకులు ఎదుర‌వ్వ‌నున్నాయా ? అన్న చ‌ర్చ ఏపీలో జ‌రుగుతోంది.

Minister Gudivada Amarnath
Minister Gudivada Amarnath

అమ‌రావ‌తికి జైకొట్టిన జ‌గ‌న్ ఆ త‌ర్వాత ప్లేట్ ఫిరాయించారు. మూడు రాజ‌ధానుల‌ను తెర మీద‌కి తెచ్చారు. రాజ‌ధాని రైతులు కోర్టు మెట్లు ఎక్కారు. రాజ‌ధాని మార్చే అధికారం శాస‌న‌స‌భ‌కు లేద‌ని హైకోర్టు తీర్పునిచ్చింది. అమ‌రావ‌తి నిర్మాణాన్ని పూర్తీ చేయాల‌ని స్ప‌ష్టం చేసింది. దీని పై ప్ర‌భుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. హైకోర్టు ఇచ్చిన కొన్ని ఆదేశాల పై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈనెల 30 మూడు రాజ‌ధానుల అంశం సుప్రీంలో విచార‌ణ‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో ఏపీ మంత్రి అమ‌ర్నాథ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లో విశాఖ నుంచి ప‌రిపాల‌న మొద‌ల‌వుతుంద‌ని ప్ర‌క‌ట‌న చేశారు.

సుప్రీం కోర్టులో రాజ‌ధాని అంశం విచార‌ణ‌లో ఉండ‌గా .. ఏపీ మంత్రి చేసిన వ్యాఖ్య‌లు చర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. కోర్టు తీర్పు త‌మ‌కు అనుకూలంగా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వైసీపీ నేత‌లు న‌మ్ముతున్నారు. ఈ నేప‌థ్యంలోనే విశాఖ నుంచి పాల‌న మొద‌లుపెట్టే ప్ర‌క‌ట‌న చేసిన‌ట్టు తెలుస్తోంది. కోర్టు తీర్పు వ‌చ్చేలోపు త‌మ‌కు అవ‌కాశం ఉన్న ప్ర‌త్యామ్నయాల‌ను వెత‌కాల‌ని యోచిస్తోంది. ఫిబ్ర‌వ‌రిలో ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ స‌మావేశాల్లోనే విశాఖ నుంచి పాల‌న మొద‌లు పెట్టే అంశం పై ప్ర‌క‌ట‌న చేయ‌నుంది. మార్చి 22 నుంచి విశాఖ నుంచి పాల‌నకు ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంద‌ని తెలుస్తోంది.

Minister Gudivada Amarnath
Minister Gudivada Amarnath

ఏపీ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల పై వెన‌క్కి త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. తీర్పు త‌మ‌కు అనుకూలంగా ఉంటుంద‌ని భావిస్తున్నారు. తీర్పు ఆల‌స్యం అయినా విశాఖ నుంచి పాల‌న ప్రారంభించాల‌ని జ‌గ‌న్ యోచిస్తాన్నారు. ప్ర‌తిప‌క్షాలు మాత్రం మూడు రాజ‌ధానులు సాధ్యం కాద‌ని తేల్చి చెబుతున్నారు. పార్ల‌మెంట్ లో చేసిన చ‌ట్టం మార్చే అధికారం పార్ల‌మెంట్ కే ఉంటుంద‌ని చెబుతున్నారు.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version