Gang Rape Case: జూబ్లీ హిల్స్ రేప్ కేసులో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికపై ఐదుగురు అత్యాచారం చేయడం సంచలనం కలిగించింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే మనవడు, ఓ ఎమ్మెల్యే కొడుకు ఉండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో కేసు విచారణ సాగుతోంది. నిందితుతలను పోలీసులు విచారిస్తున్నారు. ఒక్కరు తప్ప మిగతా నలుగురు మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోంకు తరలించారు. కానీ వారిని కూడా పోలీస్ స్టేషన్ లో విచారించేందుకు పోలీసులు అనుమతి కోరగా కోర్టు అంగీకరించింది. దీంతో రెండు రోజులుగా విచారణ వేగవంతంగా సాగుతోంది.
Also Read: Vallabhaneni Vamsi: గన్నవరంలో ‘మట్టి’ మంటలు.. వంశీకి చుక్కలు చూపిస్తున్న ప్రత్యర్థులు
ఒక్కో నిజం తెలుస్తోంది. నిందితులు బాలికను ఎలా అత్యాచారం చేశారో వివరింగా చెబుతున్నారు. బాలిక చెబితే వినకపోవడంతో గోళ్లతో రక్కినట్లు తెలుస్తోంది. ఆమె శరీరంపై ఐదో చోట్ల గాయాలు ఉన్నట్లు వైద్యులు ఇచ్చిన నివేదికలో తేల్చారు .దీంతో ఆమెను చిత్రహింసలకు గురిచేసినట్లు సమాచారం. దీంతోనే ఆమెతో పెనుగులాటలో గాయాలైనట్లు సమాచారం. వికృతంగా బాలికను రేప్ చేసినట్లు చెబుతున్నారు. పైశాచిక దాడిలో బాలిక పెనుగులాడినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఐదుగురిలో షాబుద్దీన్ ఒక్కడే మేజర్ కావడంతో అతడి నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. కారులో వారు చేసిన పనికి బాలిక విధి వంచితురాలైంది. మైనర్లను కూడా విచారిస్తున్నారు. ఒకరి తరువాత ఒకరు రాక్షసంగా బాలికను అత్యాచారం చేయడం సంచలనం సృష్టించింది. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఒత్తిళ్లతోనే కేసులో విచారణ వేగవంతం చేశారు. లేదంటే కేసును పక్కదారి పట్టించేవారు. ఈ నేపథ్యంలో నిందితులకు కఠినమైన శిక్షలు పడే వరకు వదిలిపెట్టేది లేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు రాజకీయ పక్షాల ఒత్తిళ్లతో మంత్రి కేటీఆర్ కూడా మైనర్లను కూడా మేజర్లుగా పరిగణించాలని పోలీసులకు మద్దతు తెలపడంతో కేసు బలంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Ante Sundaraniki: అంటే సుందరానికీ బిగ్ షాక్… ఆ టాక్ ఏంటీ వచ్చిన కలెక్షన్స్ ఏంటీ?