https://oktelugu.com/

Gaddar : గద్దర్ 70 ఏళ్ల తరువాత మొదటిసారి ఇక్కడే ఓటు వేశారు..

మలిదశ తెలంగాణ ఉద్యమంలో జేఏసీకి అనుకూలంగా పనిచేసిన ఆయన అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేశారు. కానీ ఏ పార్టీలో అధికారికంగా చేరలేదు.అయితే త్వరలో కొత్త పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల్లో రాజకీయాల్లోకి దిగాలని నిర్ణయించుకున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 6, 2023 5:01 pm
    Follow us on

    Gaddar : ప్రజా యుద్ధ నౌక గద్దర్ లేడన్న విషయం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో కలిసి పనిచేసిన వాళ్లు.. అయన అభిమానులు పాత విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో గద్దర్ గురించి అనేక కథనాలు వెలువడుతున్నాయి. ముక్కుసూటితనం ఉన్న గద్దర్ కు విప్లవ భావాలంటే చాలా ఇష్టం. అందుకే చదువుపూర్తికాగానే అయన తుపాకీ పట్టి అడవుల్లోకి వెళ్లాడు. 25 ఏళ్ల వయసులో భార్య, బిడ్డల్ని వదిలి విప్లవోద్యమంలోకి వెళ్లి రాజును, రాజ్యాన్ని ప్రశ్నించారు.

    ఈ తరుణంలో ఆయనకు రాజకీయాలంటే అస్లు ఇష్టం ఉండేది కాదు. రాజు, రాజ్యం అనే వ్యవస్థ కాకుండా ప్రజా వ్యవస్థ ఏర్పడాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పార్లమెంటరీ రాజకీయాలను వ్యతిరేకించిన గద్దరు 70 ఏళ్ల పాటు ఓటు వేయలేదు. తుపాకీ గొట్టం ద్వారానే విప్లవోద్యం సాధ్యమం అని చెప్పారు. అయితే నక్సల్స్ తల్లి ఉద్యమం లాంటిది.. కానీ ఇదే సమయంలో పూలే, అంబేద్కర్ బావాలను కూడా తీసుకుపోవాలన్నది నా అభిప్రాయం అని నిర్ణయించుకున్న ఆయన 2018లో తొలిసారి ఓటు వేశారు.

    2018 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భార్య విమలతో కలిసి అల్వాల్ లోని వెంకటాపురం పోలింగ్ బూత్ లో గద్దర్ తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ ‘మాది అంబేద్కర్ బావాలున్న కుటుంబ. ఇంజనీరింగ్ కాలేజీలో దళిత్ పాంథర్ ఉద్యమం నుంచి నక్సలైట్ ఉద్యమం ప్రభావంతో విప్లవోద్యమంలోకి వెళ్లాను. నాకు రాజకీయ తల్లి నక్సల్ ఉ్యదమం అయితే కార్ల్ మార్క్ సిద్ధాంతో పాటు పూలే, అంబేద్కర్ బావాలను కూడా తీసుకుపోవాలన్నది నా అభిప్రాయం. అందుకే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నా. .’ అని గద్దర్ అన్నారు.

    మలిదశ తెలంగాణ ఉద్యమంలో జేఏసీకి అనుకూలంగా పనిచేసిన ఆయన అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేశారు. కానీ ఏ పార్టీలో అధికారికంగా చేరలేదు.అయితే త్వరలో కొత్త పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల్లో రాజకీయాల్లోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ తరుణంలో ఆయనపై కొందరు విమర్శలు చేశారు. కానీ ఇంతలో అకస్మాత్తుగా గద్దర్ మరణించడంపై రాజకీయాల్లోని కలకలం రేపుతోంది.