https://oktelugu.com/

ఓడించిన ప్రజలపై పవన్ కళ్యాణ్ లో ఫస్ట్రేషన్ బయటపడిందా?

జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నో ఆశలు, ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చాడు. సీఎం సీటు కోసం.. రాజ్యాధికారం కోసం ఎప్పుడూ ఆశపడలేదు. నిజాయితీగా రాజకీయం చేశాడు. అందుకే 2014లో ఆయన బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతిచ్చి ఒక్క సీటు కూడా తీసుకోలేదు. అదే 2019లో వారి విధానాలు నచ్చక.. హామీలు నెరవేర్చకపోవడంతో ఒంటరిగా పోటీచేశాడు. అయితే రెండు చోట్ల పోటీచేసినా పవన్ కళ్యాణ్ గెలవలేకపోయారు. ఈ క్రమంలోనే తాజాగా విజయవాడలో పార్టీ మీటింగ్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఓడించిన […]

Written By:
  • NARESH
  • , Updated On : September 29, 2021 / 08:05 PM IST
    Follow us on

    జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నో ఆశలు, ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చాడు. సీఎం సీటు కోసం.. రాజ్యాధికారం కోసం ఎప్పుడూ ఆశపడలేదు. నిజాయితీగా రాజకీయం చేశాడు. అందుకే 2014లో ఆయన బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతిచ్చి ఒక్క సీటు కూడా తీసుకోలేదు. అదే 2019లో వారి విధానాలు నచ్చక.. హామీలు నెరవేర్చకపోవడంతో ఒంటరిగా పోటీచేశాడు. అయితే రెండు చోట్ల పోటీచేసినా పవన్ కళ్యాణ్ గెలవలేకపోయారు. ఈ క్రమంలోనే తాజాగా విజయవాడలో పార్టీ మీటింగ్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఓడించిన ప్రజల తీరును తప్పు పట్టారు. నిజానికి గెలిపించకపోతే ఎవరూ ప్రజలపై కోపగించుకోరు.. అది నాయకుల లక్షణం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో తిరిగి వారి మెప్పు పొంది మరోసారి గెలుస్తారు. అదే అసలైన నాయకుడి లక్షణం.. కానీ పవన్ ఈ విషయంలో తనను గెలిపించని ప్రజలను తప్పు పట్టడం హాట్ టాపిక్ గా మారింది.

    విజయవాడ జనసేన సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయాల్లో నిస్వార్థంగా సేవ చేయాలని వచ్చా.. కానీ తనను రెండు చోట్ల పోటీచేస్తే ప్రజలు ఓడించారు. వైసీపీని గెలిపించారు. ఇప్పుడు గెలిపించిన వైసీపీని వదిలేసి నన్ను పోరాడమంటున్నారు. ఇదెలా సాధ్యం? నేను ఓట్లు అడుక్కోను. అది నాకు నచ్చదు. నేను పోరాడుతున్న తీరు చూసి ఓట్లు వేయాలి’’ అంటూ ప్రజల తీరునే
    పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు. మీరు ఓట్లేసి విశాఖలో గెలిపించి ఉంటే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించకుండా ఆపేవాడని.. మోడీని గట్టిగా ప్రజాప్రతినిధిగా నిలదీసేవాడిని.. ఇప్పుడు ఓడించి నాకు వాయిస్ లేకుండా చేశారు అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.

    అయితే ప్రజాస్వామ్యం గెలుపు ఓటములు సహజం. 151 ఎమ్మెల్యేలు ఇచ్చి జగన్ ను గెలిపించిన ప్రజలే 2014లో చిత్తుగా ఓడించారు. కానీ ఆయన ఎప్పుడూ ప్రజలను తిట్టలేదు.నిందించలేదు. ఎందుకు మమ్మల్ని అధికారంలోకి రానీయలేదని అడగలేదు.

    పైగా ప్రజల నాడి తెలుసుకునేందుకు.. ఆశీర్వదించాలని ఏకంగా 3వేల కి.మీల పాదయాత్ర చేశాడు. పల్లెపల్లెకు వెళ్లి ప్రజలతో మమేకమయ్యాడు. ప్రజా సమస్యలపై నిలదీశాడు. అలా ప్రజల్లో ఉన్నాడు కాబట్టే ఓడించిన జగన్ ను అక్కున చేర్చారు. ఏపీ చరిత్రలోనే ఘనవిజయాన్ని కట్టబెట్టారు.

    ఇప్పుడు పవన్ మాత్రం తనను ఓడించారని.. అందుకే విశాఖ ఉక్కును రక్షించలేకపోతున్నానని.. బీజేపీని తన వెనుక ఎమ్మెల్యేలు లేరు కాబట్టి నిలదీయలేకపోతున్నానని అనడంపై విశ్లేషకులు తప్పు పడుతున్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడైనా ప్రజా సమస్యలపై పోరాడి వారిసమస్యలు తీరిస్తేనే అధికారంలోకి వస్తాయి. ప్రజల వెంట నడిచి వారితో మమేకం అయినప్పుడే అది సాధ్యం. కానీ ప్రజలు ఓడించారని తాను సమస్యలు తీర్చడం లేదన్నది కరెక్ట్ కాదని అంటున్నారు. ఓడినప్పుడే ప్రజల వెంట ఉండి.. వారితో కలిసి పోరాడితే పవన్ ను ప్రజలు ఆదరిస్తారని.. గెలిపిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.