https://oktelugu.com/

Janasena BJP Alliance: పవన్ కళ్యాణ్ పై ఫుల్ క్లారిటీ.. అందరి ఫోకస్ జనసేనానిపైనే..

Janasena BJP Alliance:  ఆయన మా బలమైన స్నేహితుడు..అని ఒక పార్టీ. వన్ సైడ్ లవ్ ఉంటే సరిపోదూ.. అటు నుంచి ప్రేమ ఉండాలి కదా అని మరో పార్టీ. వారి ట్రాప్ లో పడొద్దని ఇంకో పార్టీ… ఇది జనసేనాని పవన్ కల్యాణ్ విషయంలో రాష్ట్రంలో మిగతా పార్టీలు పడుతున్న ఆరాటం. అసలు పవన్ కు అంత సినిమా లేదని ఒకరు. రాజకీయ పరిణితి లేదని కొందరు. అన్న చిరంజీవి ప్రజారాజ్యంలా పార్టీ మూసుకోవాల్సిందేనని మరికొందరు. […]

Written By:
  • Admin
  • , Updated On : April 5, 2022 11:18 am
    Follow us on

    Janasena BJP Alliance:  ఆయన మా బలమైన స్నేహితుడు..అని ఒక పార్టీ. వన్ సైడ్ లవ్ ఉంటే సరిపోదూ.. అటు నుంచి ప్రేమ ఉండాలి కదా అని మరో పార్టీ. వారి ట్రాప్ లో పడొద్దని ఇంకో పార్టీ… ఇది జనసేనాని పవన్ కల్యాణ్ విషయంలో రాష్ట్రంలో మిగతా పార్టీలు పడుతున్న ఆరాటం. అసలు పవన్ కు అంత సినిమా లేదని ఒకరు. రాజకీయ పరిణితి లేదని కొందరు. అన్న చిరంజీవి ప్రజారాజ్యంలా పార్టీ మూసుకోవాల్సిందేనని మరికొందరు.

    Janasena and BJP

    రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన నీకెందుకు రాజకీయాలు అని చాలామంది హేళన చేశారు. గుచ్చిగుచ్చి మాట్లాడి పవన్ మనోభావాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. కానీ వాటన్నింటిని తట్టుకొని నిలబడ్డ పవన్ ప్రజల అభిమానాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. దీంతో పవన్ ను ఎలాగైనా చేరదీసుకోవాలని మిగతా పక్షాలు తెగ ప్రయత్నం చేస్తున్నాయి. పవన్ ఉంటేనే అధికార పక్షాన్ని ఎదుర్కొవచ్చని విపక్షాలు, పవన్ ను కట్టడి చేయగలిగితే మనం సేఫ్ జోన్ లో ఉండగలమని అధికార పక్షం భావించేదాక పరిస్థితి వచ్చంది.

    Also Read: IPL 2022: రైజర్స్ కథ మళ్లీ కంచికి.. సభ్యులు మారినా తలరాత మారలే.. టాప్ లోకి ఆ జట్టు

    వాస్తవానికి గతంతో పోల్చుకుంటే పవన్ లో రాజకీయ పరిపక్వత వచ్చింది. ప్రజా సమస్యలపై గళమెత్తుతున్నారు. వారిపైనే ఫోకస్ పెట్టారు. దీంతో ప్రజల్లో పవన్ పై అనుకూల ధోరణి ప్రారంభమైంది. అందుకే పవన్ ను మచ్చిక చేసుకోవడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని మిగతా పార్టీలు భావిస్తున్నాయి.

    జనసేన ఇప్పటికే బీజేపీ మిత్ర పక్షంగా ఉంది. విధానపరంగా, సిద్ధాంతపరంగా బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు పవన్ ను చాలా గౌరవభావంతో చూస్తున్నాయి. అందుకే ఆయన స్వేచ్ఛగా వ్యవహరించగలుగుతున్నారు. ఎలాంటి ప్రజా సమస్యలపైన అయినా మాట్లాడగలుస్తున్నారు. అందుకే ఇప్పుడు పవన్ ను తమవైపు తిప్పుకోవాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం భావిస్తోంది. ‘లవ్’ సెంటిమెంట్ పండిస్తూ చంద్రబాబు ఇప్పటికే స్నేహహస్తం అందించారు. లవ్ అనేది వన్ సైడ్ కాదు అటువైపు నుంచి రావాలని జనసేన వైపు ఆయన చూడకనే చూస్తున్నానని గుట్టు విప్పేశారు.

    Janasena BJP Alliance

    టీడీపీ అంతర్గత సమావేశాల్లో సైతం పవన్ మనవైపు వస్తేనే అధికార పక్షానికి ఎదురెళ్లగలమని చెబుతున్నారు. పవన్ కోసం కాస్తా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బీజేపీ ఇప్పటికే పవన్ విషయంలో క్లారిటీ గా ఉంది. బలమైన మిత్ర పక్షంగా చెబుతోంది. ప్రస్తుతం టీడీపీ కంటే బీజేపీయే పవన్ కు బలమైన మిత్ర పక్షం. దేశ వ్యాప్తంగా మోదీ ప్రభ వెలుగుతున్న వేళ..అన్ని రాష్ట్రాలూ హస్తగతమవుతున్న వేళ పవన్ బీజేపీకి మిత్రుడిగా ఉండడమే శ్రేయస్కరమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్ పరిణామాలతో పవన్ కు రాజకీయ భవిష్యత్ ఉందనేది సర్వత్రా భావన. ఒకవేళ అయినా బీజేపీని వదులుకుంటే మాత్రం కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే.

    ఇప్పటికే ఎన్నికలు జరిగిన ప్రతీ రాష్ట్రంలో బీజేపీ పాగా వేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో మిత్రపక్షంతో అధికారాన్ని పంచుకుంటోంది. అటువంటి పరిస్థితే మన రాష్ట్రంలో రాబోయే సూచనలున్నాయి. అటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉంటే రాజకీయ లక్ష్యం సాధ్యపడే అవకాశముంది. అదే సమయంలో పవన్ ఉంటేనే బీజేపీకి జోష్ ఉంటుంది. ఇప్పటికే చంద్రబాబు బీజేపీకి చేయాల్సిన నష్టాన్ని చేసేశారు. ఆ పార్టీ రాష్ట్రంలో కోలుకోలేని విధంగా డ్యామేజ్ చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కు మరింత చేయూతనిచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం బీజేపీ పై ఉంది. ఆయన రాజకీయ ఉన్నతికి అవసరమైన కార్యాచరణ ఇప్పటి నుంచే ప్రారంభిస్తే 2024 ఎన్నికల నాటికి జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారం వైపు అడుగులు వేసేవి అన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

    ప్రజా వ్యతిరేక ఓటు చిలిపోనివ్వమని పార్టీ ఆవిర్భావ సభలో జనసేనాని ప్రకటించిన తరువాత అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే పుట్టి మునగడం ఖాయమని వైసీపీ నేతలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ సమయంలో విపక్షాలు అన్నీ ఒకే తాటిపైకి వస్తే అధికార పార్టీకి ఎదురీత తప్పదు.

    అందుకే ఎట్టి పరిస్థితుల్లో పవన్ ను ఇతర పక్షాలతో కలవనీయకుండా అధికార పక్షం అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. మొన్నటికి మొన్న సినిమా టిక్కెట్ల వ్యవహారంలో సీఎం జగన్ ను చిరంజీవి పలుమార్లు కలిశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఇతర పార్టీల ట్రాప్ లో పడకుండా చూడాలని జగన్ నుంచి చిరంజీవికి సూచన వచ్చిందని ప్రచారం జోరుగా సాగింది. అయితే దానిపై చిరంజీవి కూడా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. తమ్ముడు తన మాట వినడని.. తనకు నచ్చిన రీతిలో వెళతాడని బదులిచ్చినట్టు సమాచారం. అయితే పవన్ అంటేనే బూతులు మాటాడే కొడాలి నాని సైతం చంద్రబాబు ట్రాప్ లో పడవద్దని పవన్ కు సూచించారంటే పరిస్థితి ఎందాక వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. అసలు రాజకీయలకే పనికిరాడన్న పార్టీ అధినేతలకు, మంత్రులకు, నాయకులకు పవన్ విషయంలో ఇప్పడిప్పుడే క్లారిటీ వస్తుందన్న మాట.

    Also Read:Pub Drugs Case: ఏ3గా అర్జున్ వీరమాచినేని.. ఈయన నందమూరి ఫ్యామిలీ అని తెలుసా?

    Tags