Homeజాతీయ వార్తలుSeptember New Rules : గ్యాస్‌ నుంచి ఆధార్‌ వరకు.. సెప్టెంబర్‌ నుంచి అనేక మార్పులు...

September New Rules : గ్యాస్‌ నుంచి ఆధార్‌ వరకు.. సెప్టెంబర్‌ నుంచి అనేక మార్పులు ఇవే..

September New Rules :  కాల గమనంలో మనం ఇంగ్లిష్‌ క్యాలెండర్‌లో 12 నెలలు ఏర్పటు చేసుకున్నాం. ప్రపంచమంతా ఈ క్యాలెండర్‌నే ఫాలో అవుతుంది. ఇక మన తెలుగు క్యాలెండర్‌ కూడా ఏడాదికి 12 నెలలే కానీ దీనిని మన సంస్కృతికి మాత్రమే వాడుకుంటాం. రాకపోకలు, సెలవులు, లావాదేవీలు.. ఇలా అన్నింటికి ఇంగ్లిష్‌ క్యాలెండరే ప్రమాణికం. ఈ ఇంగ్లిష్‌ క్యాలెండర్‌పై ఆధారపడే ప్రతీనెల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నెల నెలా మార్పులు చేస్తుంటాయి. వాటికి అనుగునంగా ఆయా సంస్థలతో సంబంధం, అవసరం ఉన్నవారు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే అప్‌డేట్‌ అవుతాం. లేదంటే పోటీ ప్రపంచంలో వెనుకబడిపోతాం. ఇక 2024లో ఆగస్టు నెల ముగింపునకు వచ్చింది. మరో వారం రోజుల్లో సెప్టెంబర్‌ నెల ప్రారంభం కానుంది. ప్రజల ఆర్థిక స్థితిని నేరుగా ప్రభావితం చేసే అనేక ముఖ్యమైన మార్పులు సెప్టెంబర్‌ నుంచి జరగబోతున్నాయి. ఎల్పీజీ సిలిండర్‌ ధరల నుంచి ఆధార్‌ అప్డేట్‌ వరకు రానున్న మార్పులు, కొత్త క్రెడిట్‌ కార్డ్‌ నియమాలు మీ బడ్జెట్ను ఎలా ప్రభావితం చేస్తాయో. ఇక్కడ చూద్దాం..

ఎల్పీజీ ధరలు
ప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీన ఎల్పీజీ ధరలను సవరించడం సర్వసాధారణం. ఈ సర్దుబాట్లు వాణిజ్య డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లపై ప్రభావం చూపుతాయి. గత నెలలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.8.50 పెరిగింది. జూలైలో రూ.30 తగ్గింది. మరోసారి సెప్టెంబర్‌లో ఎల్పీజీ సిలిండర్ల ధర మార్పుపై అంచనాలు ఉన్నాయి.

సీఎన్‌జీ, పీఎన్‌జీ రేట్లు..
ఎల్పీజీ ధరతోపాటు చమురు మార్కెటింగ్‌ కంపెనీలు ఏవియేషన్‌ టర్బైన్‌ ఇంధనం సీఎన్బీ, పీఎన్బీ ధరలు కూడా మారుతాయి. సవరిస్తారు. సెప్టెంబర్‌ 1న ఈ ఇంధన ధరలు కూడా సవరిస్తారు.

ఆధార్‌ కార్డ్‌ ఫ్రీ అప్‌డేట్‌..
ఆధార్‌ కార్డ్‌లను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్‌ 14. ఈ తేదీ తర్వాత, ఆధార్‌ కార్డుకు నిర్దిష్ట అప్‌డేట్‌ చేసుకునేందుకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత ఆధార్‌ అప్‌డేట్‌ కోసం గతంలో జూన్‌ 14 వరకే గడువు విధించగా దానిని సెప్టెంబర్‌ 14 వరకు పొడిగించారు.

క్రెడిట్‌ కార్డ్‌ నియమాలు
ఇక సెప్టెబర్‌ 1 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ యుటిలిటీ లావాదేవీల ద్వారా ఆర్జించే రివార్డ్‌ పాయింట్లపై పరిమితిని ప్రవేశపెడుతోంది. ఇకపై ఈ లావాదేవీలపై కస్టమర్లు నెలకు గరిష్టంగా 2,000 పాయింట్లను మాత్రమే పొందగలరు. థర్డ్‌–పార్టీ యాప్‌ల ద్వారా చేసిన విద్యాపరమైన చెల్లింపులకు ఎలాంటి రివార్డ్‌ పాయింట్స్‌ లభించవు.
హెచ్‌డీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు సెప్టెంబర్‌ నుంచి క్రెడిట్‌ కార్డపై చెల్లించాల్సిన కనీస చెల్లింపును తగ్గిస్తోంది. అలాగే పేమెంట్‌ విండో 15 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. యూపీఐ, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో రూపే క్రెడిట్‌ కార్డ్‌ లను ఉపయోగించే కస్టమర్లు ఇతర చెల్లింపు సర్వీస్‌ ప్రొవైడర్ల మాదిదే రివార్డ్‌ పాయింట్స్‌ అందుకుంటారు.

స్పామ్‌ కాల్స్‌కు నిబంధనలు..
స్పామ్‌ కాల్స్, స్పామ్‌ మెస్సేజ్‌లపై సెప్టెంబర్‌ 1 నుండి కఠినమైన నిబంధనలు ఉండవచ్చు. ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ట్రాయ్‌ టెలికాం కంపెనీలను ఆదేశించింది. 140 మొబైల్‌ నంబర్‌ సిరీస్‌తో ప్రారంభమయ్యే టెలిమార్కెటింగ్‌ కాల్స్, వాణిజ్య సందేశాలను సెప్టెంబర్‌ 30 నాటికి బ్లాక్‌ చెయిన్‌ ఆధారిత డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ టెక్నాలజీ (ఈఔఖీ) ప్లాట్‌ఫామ్‌కి మార్చడానికి ట్రాయ్‌ కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

డియర్నెస్‌ అలవెన్స్‌
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సెప్టెంబరులో డియర్‌నెస్‌ అలవెన్స్‌ (డీఏ) పెంపును ప్రకటించనుందని ఊహాగానాలు ఉన్నాయి. ప్రభుత్వం డీఏని 3 శాతం పెంచవచ్చు. అంటే ప్రస్తుతం 50% ఉన్న డీఏ 53 శాతానికి పెరిగే అవకాశం ఉంది.
Displaying

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular