
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కు 2016 హుష్ మనీ చెల్లింపుల కేసులో అరెస్టు అయ్యారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం దాటిన తర్వాత ఆయనను మన్ హాట్టన్ న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. ఈ సంఘటన అమెరికా వ్యాప్తంగా తీవ్రతంచలనం సృష్టిస్తోంది. 2024 ఎన్నికలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ట్రంప్ అరెస్టు కావడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఇలాంటి నేరాభియోగాలు ఎదుర్కొంటూ ట్రంప్ మాత్రమే కాదు చాలామంది వివిధ దేశాల నేతలు కటకటాల పాలయ్యారు. ఈ జాబితా పెద్దది.. పాకిస్తాన్ నుంచి అర్జెంటినా వరకు ఎంతో మంది ఇందులో ఉన్నారు.
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై ఏకంగా 85 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఉగ్రవాదం, అవినీతి, దేశద్రోహం, కోర్టు ధిక్కరణ వంటి కేసులు ఉన్నాయి. ఇక 2022లో అర్జెంటీనా మాజీ ఉపాధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండేజ్ డీ కిష్నేర్ వివిధ నేరారోపణలు ఎదుర్కొన్నారు. 2007 నుంచి 2015 మధ్యకాలంలో అధ్యక్షురాలిగా పనిచేసిన సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆమె మీద ఆరోపణలు ఉన్నాయి. అవి రుజువు కావడంతో ఆమెకు ఆరు సంవత్సరాల పాటు జైలు శిక్ష పడింది. అంతేకాదు రాజకీయాల్లోకి ప్రవేశించకుండా జీవితకాల నిషేధానికి గురయ్యారు.

ప్రస్తుత బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ పై మనీలాండరింగ్ కేసులు కూడా నమోదు అయ్యాయి. 2021 లో వాటిని న్యాయస్థానం కొట్టేసింది. ఇక తన హయాంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలపై క్రొయేషియా మాజీ ప్రధానమంత్రి ఇవో సనాడెర్ కు 2020 లో 8 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు జాక్వెస్ చిరాక్, నికొలాస్ సర్కోజీ కి మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష పడింది. అధికారాన్ని దుర్వినియోగం చేశారనే అభియోగాలపై జర్మనీ మాజీ అధ్యక్షుడు క్రిస్టియన్ ఉల్ఫ్ విచారణ ఎదుర్కొన్నారు.
ఇక అత్యాచారానికి పాల్పడిన ఘటనలు, కిందిస్థాయి మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల కేసులో ఇజ్రాయిల్ మాజీ అధ్యక్షుడు మోషే కట్సావ్ కు ఈ సంవత్సరంలో ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఐదు సంవత్సరాల శిక్షణ తర్వాత ఆయన విడుదలయ్యారు. ఇజ్రాయిల్ దేశానికి చెందిన యాహుద్ ఒల్మెర్ట్ తో పాటు బెంజమిన్ నెతన్యాహు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక ప్రాస్టిట్యూషన్ కేసులో ఇటలీ మాజీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లు స్కోనీ ని ఆ దేశ న్యాయస్థానం దోషిగా తేల్చింది. దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా మాజీ అధ్యక్షులు జాకబ్ జుమా, లీ మ్యుంగ్ బాక్, పాకిస్తాన్, పోర్చుగల్, మలేషియా మాజీ ప్రధాన మంత్రులు ఇమ్రాన్ ఖాన్, జోస్ సోక్రటీస్,మహ్యుద్దీన్ యాసిన్, నజీబ్ రజాక్… నేరారోపణలు ఎదుర్కొన్న వారిలో ఉన్నారు.