Thatikonda Rajaiah Open Heart With RK
Thatikonda Rajaiah Open Heart With RK: “నేను చిన్నపిల్లల వైద్యుడిని. అప్పట్లో హనుమకొండలో ఒక నర్సింగ్ హోమ్ పెట్టినప్పుడు అగ్రకులాల వారంతా ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా ముందుకే వచ్చాను. పేరు మోసిన డాక్టర్ గా వినతి కెక్కాను. రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలుపొందాను. కడియం శ్రీహరిని చూసి రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నాను. ఆయన కంటే ఎక్కువ స్థాయికి వెళ్లిపోయాను.. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఎదిగాను. కానీ ఆరు నెలలోనే నా పదవిని కోల్పోయాను. కాకిగా కలకాలం బతికే కంటే హంసలా ఆరు నెలలు ఉంటే మంచిదనుకున్నాను. అలానే చేశాను. టికెట్ రాకపోవడం వల్ల బాధగానే ఉంది. కానీ నా చేతిలో ఏమీ లేదు.. నాకు అమ్మాయిల వీక్నెస్ లేదు.. కడియం శ్రీహరి వల్లే ఈ గోలంతా? కులాన్ని బట్టి కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఆంధ్రజ్యోతి ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో ఇంటర్వ్యూ చేశారు.. వచ్చే ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించి యూట్యూబ్లో ప్రోమో ప్రసారమైంది.
ఈ ప్రోమోలో రాధాకృష్ణ అందరూ ఊహించిన విధంగానే వివాదాస్పద ప్రశ్నలు అడిగాడు. మీకు అమ్మాయిల వీక్నెస్ ఉందా? పుట్టినరోజు వేడుకల్లో అమ్మాయి వేలు నాకడం ఏంటి? సర్పంచ్ నవ్యను వేధించింది నిజం కాదా? అందువల్లే కదా మీరు మంత్రిగా బర్తరఫ్ అయింది? టికెట్ రాకుంటే చిన్నపిల్లాడి లాగా ఎందుకు గోల పెట్టి ఏడ్చారు? దామోదర రాజనర్సింహ మీ ఇంటికి వచ్చింది నిజం కాదా? త్వరలో మీరు మీ సొంత పార్టీలోకి వెళ్లిపోతున్నారా? ఇలాంటి ప్రశ్నలు రాధాకృష్ణ అడగడంతో రాజయ్య ఒకింత ఇబ్బంది పడ్డాడు. కొన్నింటికి సమాధానం చెప్పలేక రాధాకృష్ణకు చేతులెత్తి మొక్కాడు.. నవ్యను తను అలా వేధించలేదని, కొంతమంది నన్ను కావాలనే బదనాం చేశారని రాజయ్య వివరించే ప్రయత్నం చేశాడు.
సోషల్ మీడియాలో వచ్చే వీడియోల గురించి స్పందించిన రాజయ్య..” నేను బోలా మనిషిని. కడుపులో ఏదీ దాచుకోను. పుట్టినరోజు వేడుకల్లో కేక్ తినిపించినా కూడా దాన్ని మార్ఫింగ్ చేసి వీడియో వదిలారు. కడియం శ్రీహరి మనుషులు వాటిని వైరల్ చేశారు. అంతేగాని నా వ్యక్తిత్వం అలాంటిది కాదు.. టికెట్ రాకపోయినప్పుడు ప్రెస్ వాళ్ల దగ్గరికి వెళ్లి గోల గోల చేయొద్దని, కచ్చితంగా అవకాశం లభిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. దామోదర రాజనర్సింహ కలిసింది వాస్తవమే. మాదిగ కులానికి చెందిన వాడిని కాబట్టే నన్ను అణగదొక్కుతున్నారు.” అంటూ రాజయ్య పలు ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. ఇంకా ఇవే కాకుండా ఇంకా లోతైన ప్రశ్నలు ఆర్కే సంధించినట్టు కనిపిస్తోంది. మరి వీటికి రాజయ్య ఏ విధమైన సమాధానం చెప్పారో? దానికి ఆర్కే ఏ విధమైన కౌంటర్ ఇచ్చారో? పూర్తి ఎపిసోడ్ ప్రసారమైతే గాని తెలియదు. ఈ ఎపిసోడ్ ఈ ఆదివారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ప్రసారమవుతుంది.. ఇప్పటికే భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా వెళ్తున్న రాధాకృష్ణ.. కెసిఆర్ టికెట్లు నిరాకరించిన వారితో ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఆ జాబితాలో రాజయ్య కూడా తాజాగా చేరారు. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారో? రాజయ్య చెప్పిన విధంగా కేసీఆర్ మార్పులు, చేర్పుల్లో భాగంగా టికెట్ ఇస్తారా? అనేది కాలం గడిస్తే గాని చెప్పలేం.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Former deputy cm of telangana tatikonda rajaiah open heart with rk
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com