
కేంద్రంలోని మోదీ సర్కార్ ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కొత్తగా వ్యవసాయ సంస్కరణలపై మూడు బిల్లులను తీసుకొచ్చింది. ఈ బిల్లుల వల్ల రైతులకు మేలు కలుగుతుందని కేంద్రం చెబుతోంది. అయితే బిల్లు వల్ల తమకు తీవ్రంగా నష్టం జరుగుతుందని ఉత్తరాది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన చేస్తున్నారు.
Also Read: రజినీకాంత్ ఎన్టీఆర్ రికార్డ్ ను బద్దలుకొట్టగలడా..?
లాక్డౌన్ సమయంలో బిల్లులు ఆమోదం పొందడటంతో కొద్దిరోజులు స్తబ్ధుగా ఉన్న రైతులు ఆన్ లాక్ తర్వాత పోరుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా పంజాబ్ రైతులు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఢిల్లీ బాట పట్టారు. కేంద్రంతో తాడోపోడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. రైతుల నిరసన ఢిల్లీలో ఉద్రిక్తంగా మారడంతో కేంద్రం పలుమార్లు వారిని చర్చలకు ఆహ్వానించింది.
ఈక్రమంలోనే కేంద్ర ప్రభుత్వం గురువారం సైతం రైతులతో చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలు అసంపూర్తిగా నిలిచాయి. ఇదిలా ఉంటే శుక్రవారం నాటికి రైతుల నిరసనలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. రైతుల ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ వాసుల ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి.
Also Read: రాహుల్ పై శరద్ ఆసక్తికర వ్యాఖ్యలు
సింఘ.. టిక్రి.. సఫియాబాద్.. సబోలి తదితర సరిహద్దులను పోలీసులు శుక్రవారం మూసివేశారు. అంతేకాకుండా 44వ జాతీయ రహదారికి రెండువైపులా రాకపోకలను నిషేధించగా.. ఝతికరా సరిహద్దుల్లో కేవలం టూవీలర్స్ కు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో ఇతర మార్గాల్లో కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోతుంది.
ట్రాఫిక్ సమస్యతో ఉద్యోగాలకు వెళ్లేవాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రైతులు యూపీ-ఢిల్లీ మార్గాన్ని నిర్బంధించారు. కేంద్రంపై రైతులు కొనసాగిస్తున్న నిరసనలకు పలు సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఇక శనివారం మరోసారి కేంద్రం రైతులతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. దీంతో ఈసారైనా చర్చలు విజయవంతం అవుతాయా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
Comments are closed.