Love Marriage: ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తారు ప్రేమికులు. వారిని విడగొట్టేందుకు ప్రయత్నిస్తారు పెద్దలు. ఇలాంటి సంఘటనలు దేశంలో కోకొల్లలు. తమ మాట వినలేదని ఆక్రోశంతో కన్నవారిని సైతం కర్కశంగా అంతమొందించిన ఉదంతాలు ఉన్నాయి. తమ ప్రతిష్టకు భంగం కలిగించారనే నెపంతో కన్న వారి పైనే ఆగ్రహం పెంచుకుని వారిని నడిరోడ్డులో కూడా క్రూరతంగా దాడి చేసేందుకు సైతం వెనకాడరు. ఇలాంటి సంఘటనే మైసూరులో చోటుచేసుకోవడం చర్చనీయాంశం అవుతోంది. కన్న తండ్రి చేసిన నిర్వాకంపై అందరు ఆశ్చర్యపోయారు.

నంజనగూడు తాలూకాలోని హరతళి గ్రామానికి చెందిన చైత్ర హల్ఫెర గ్రామానికి చెందిన మహేంద్ర ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కలిసి వివాహం చేసుకుని కలకాలం కలిసి మెలిసి ఉండాలని కోరుకున్నారు. చేసుకున్న బాసలు చెప్పుకున్న ఊసులు నిజం చేసుకోవడానికి సంకల్పించారు. ఇందులో భాగంగానే వారు ప్రేమ వివాహం చేసుకుని ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
వీరి ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో వారు ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలో ఈనెల 8న ఒక గుడిలో దైవసాక్షిగా ఇద్దరు ఏకమయ్యారు. పెళ్లిని రిజిస్టర్ చేసుకోవాలని సోమవారం సాయంత్రం వెళ్తుండటంతో వారిని వధువు తండ్రి అడ్డుకున్నాడు. వధూవరులపై దాడి చేసేందుకు ఉపక్రమించాడు. దీంతో స్థానికులు అడ్డుకున్నా ఆయన తన పగ కోసం వారిపై దాడి చేసేందుకే సిద్ధమై తాళిని తెంపి కూతురును జట్టు పట్టుకుని లాక్కెళ్ల సాగాడు.
Also Read: Meaning Of Dreams: ఈ వస్తువులు కలలో కనిపిస్తే మీకు జీవితంలో ఎదురుండడు.. అన్ని శుభాలే!
దీంతో చుట్టుపక్కల వారు గమనించి వారిని అడ్డుకున్నారు. కానీ తండ్రి మాత్రం తగ్గలేదు. కూతురుపై విచక్షణారహితంగా దాడి చేసేందుకు ఉత్సాహం చూపించడంతో స్థానికులు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి ఫిర్యాదు చేశారు. కన్న తండ్రే కాలయముడిగా రోడ్డుపైనే దాడికి పూనుకోవడం చూసి ఆశ్చర్యపోయారు. అందరు కలిసి తండ్రిపై ఫిర్యాదుకు రావడంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Money: రోడ్డుపై దొరికిన డబ్బులను తీసుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!