
Farmhouse Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫాంహౌస్ కేసు అటకెక్కబోతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. దాదాపు ఆరు నెలలుగా బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య దర్యాప్తు సంస్థల పేరిట సాగిన అధిపత్య పోరుకు దేశ అత్యున్నత న్యాయస్థానం చెక్ పెట్టినట్లు కనిపిస్తోంది. కేసు విచారణను సుదీర్ఘ వాయిదా వేయడం ఇప్పుడు చర్చనీయాంశమూంది.

కేసు ఇదీ..
తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ ప్రయత్నించిందని ఇందుకోసం ముగ్గురు దూతలను పంపిందని బీఆర్‌ఎస్ అలియాస్ టీఆర్‌ఎస్ ఆరోపించింది. ఈమేరకు పోలీసులతో దాడిచేయించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. విచారణకు సిట్ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో బీజేపీ పెద్దనేతులు ఉన్నారని అవన్నీ బయట పెడతామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు యత్నించిన తీరుకు సంబంధించిన వీడియోలను న్యాయమూర్తులకు పంపుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు సిట్ కేసీఆర్ సూచనల మేరకు దూకుడుగా వ్యవహరించింది. బీజేపీ జాతీయ కార్యదర్శితోపాటు, అమిత్‌షాను కూడా ఇందులోకి లాగాలాని ప్రయత్నించింది.
కోర్టును ఆశ్రయించిన నిందితులు..
ఈ కేసులో నిందులు అయిన రామచంద్రభారతి, సింహయాజి, నందుకుమార్ సిట్ విచారణపై హైకోర్టును ఆశ్రయించారు. సిట్ సీఎం ఆదేశాల మేరకు పనిచేస్తోందని, దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తోందని పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి సీఎం మీడియా సమావేశం పెట్టడం, దర్యాప్తుకు ఆటంకం కలిగేలా వ్యవహరించడం, వీడియోలు న్యాయమూర్తులక పంపడాన్ని తప్పు పట్టింది. విచారణను సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. దీంతో సిట్ డివిజన్‌బెంచ్‌ను ఆశ్రయించింది. అక్కడ కూడా అదే తీర్పు రావడంతో దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఇరుపక్షాల వాదనలు విన్నారు. తీర్పు వెల్లడించకుండా, కేసులు జూలై 31వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.
గతంలో ఓటుకు నోటు ఇలాగే..
గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు, నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యుడు స్టీఫెన్‌సన్‌కు నేరుగా డబ్బులు ఇస్తూ పట్టుపడ్డాడు. ఈ కేసులో ఆయనను పోలీసులు రెడ్‌హ్యాండెగా పట్టుకున్నారు. రేవంత్ జైలుకు కూడా వెళ్లొచ్చారు. అయితే దర్యాప్తు మాత్రం నత్తనడకన సాగుతోంది. మరోవైపు చంద్రబాబు నాయకుడు రాష్ట్రం విడిచి పోయాడు. రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య కొన్ని రోజులు ఆధిపత్య పోరు కూడా జరిగింది. కానీ తర్వాత ఆ కేసు కోల్డ్ స్టోరేజీకి వెళ్లింది. తాజాగా ఫాంహౌస్ కేసు కూడా ఇలాగే కోల్డ్ స్టోరేజీకి వెళ్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.