Ram Charan – PM Modi: గత కొంత కాలం నుండి ప్రపంచం మొత్తం మారుమోగిపోయిన పేరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.#RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించిన రామ్ చరణ్ నామస్మరణ తో అంతర్జాతీయ అవార్డు ఫంక్షన్స్ అన్నీ మారుమోగిపోయ్యాయి.గోల్డెన్ గ్లోబ్ అవార్డు దగ్గర నుండి ఆస్కార్ అవార్డ్స్ వరకు #RRR మూవీ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు గా రామ్ చరణ్ నిలిచాడు.

ఇది నిజంగా మెగా అభిమానులకు ఎంతో గర్వ కారణం గా చెప్పుకోవచ్చు.ఇంత ఘనత సాధించిన రామ్ చరణ్ రేపు ఇండియాలోకి అడుగుపెట్టబోతున్నాడు.ఆయనని ఘనంగా ఆహ్వానించడానికి అభిమానులు కూడా సిద్ధం అయిపోయారు.ఇక రామ్ చరణ్ తండ్రి చిరంజీవి కి తన కొడుకు ని చూసి ఎంత సంతోషం గా ఉంది ఉంటుందో ఆయన మాటల్లోనే నిన్న మనం చూసాము.రామ్ చరణ్ ఇండియా ని వదిలి అమెరికాకి ప్రయాణమై దాదాపుగా 20 రోజులు అవుతుంది.
అయితే ఇండియా కి రాగానే రామ్ చరణ్ న్యూ ఢిల్లీ లో ఈ నెల 17 మరియు 18 వ తేదీలలో జరగబోతున్న ఇండియా టుడే కాంక్లెవ్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నాడు.అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ తో పాటుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జాన్వీ కపూర్ తదితరులు హాజరు అవుతున్నారు.ఈ ఈవెంట్ లో మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలల చాటిచెప్పినందుకు గాను రామ్ చరణ్ ని ప్రత్యేకంగా ప్రధాన మంత్రి సమక్ష్యం లో సన్మానించబోతున్నారట.
ఇది మరొక అరుదైన ఘట్టంగా రామ్ చరణ్ అభిమానులు తమ జ్ఞాపకాలలో పదిలపర్చుకోవచ్చు.ఈ ఈవెంట్ లో ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కంటే ముందుగా ప్రసంగించబోతున్నాడట.ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం.ఈ ఈవెంట్ కి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.