Crime News:ఒక రియల్ వెంచర్ అతడి కథ మార్చింది. ఏకంగా కోటీశ్వరుడిని చేసింది.కోట్లు వచ్చిపడ్డాయి. దీంతో అప్పనంగా రియల్ ఎస్టేట్ లో సంపాదించిన ఆ వ్యక్తికి ఆడవాళ్లపై మోజు పడింది. ఓ అందమైన బ్యూటీషీయన్ కు వల వేశాడు. ఆమె సై అన్నది. అప్పటికే భార్య పిల్లలు ఉన్నా కూడా రెండో భార్యగా ఆమెను చేసుకున్నాడు. రూ.6 కోట్లు పెట్టి పెద్ద బంగళా కట్టించాడు. కట్ చేస్తే ఇదే బ్యూటీషియన్ అయిన రెండో భార్య చేతిలోనే ఆ రియల్టర్ హత్య చేయబడ్డాడు. అసలేం జరిగింది?
ఆరేళ్ల కిందట ముచ్చట ఇదీ.. కర్ణాటకలోని నెలమంగల తాలూకా మాదనాయకన హళ్లి పీఎస్ పరిధిలో పలార్ స్వామి అలియాస్ స్వామిరాజ్ (50) అనే రియల్టర్ ఉండేవాడు. బెంగళూరు ఉత్తర తాలూకాలో లేఔట్లు వేసి కోట్ల రూపాయలు ఆర్జించాడు. అతడు బ్యూటీషియన్ నేత్ర అందచందాలకు మనసు పడి ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. సెకండ్ సెటప్ పెట్టాడు.
6 ఏళ్ల కిందట బ్యూటీ పార్లర్ నడుపుతున్న నేత్రతో వివాహేతర సంబంధం ఏర్పడి నేత్రను పెళ్లి చేసుకున్నాడు.
నేత్ర కోసం ఏకంగా హారో క్యాతనహళ్లి వద్ద రూ.6 కోట్లు ఖర్చుపెట్టి పెద్ద బంగ్లా నిర్మించి ఇచ్చాడు. ఆదివారం రాత్రి పలార్ స్వామిని రాడ్ తో కొట్టి హత్య చేసిన నేత్ర మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయింది. ఎందుకు చంపావ్ అంటే షాకింగ్ కారణం చెప్పింది.
తన భర్త స్వామి రాజు తనను పరాయి పురుషుల వద్దకు వెళ్లాలని బలవంతం చేశాడని.. అందుకే హత్య చేశానని పోలీసులకు తెలిపింది. అయితే మొదటి భార్య మాత్రం.. తనను, పిల్లలను బాగా చూసుకుంటున్నాడనే కోపంతోనే హత్య చేసిందని మొదటి భార్య ఆరోపిస్తోంది.. ప్రస్తుతం పోలీసులు కేసును విచారిస్తున్నారు. అసలు నిజాలు తెలియాల్సి ఉంది.