ఎగ్జిట్ పోల్స్: 5 రాష్ట్రాల్లో గెలుపెవరిదంటే?

దేశంలోని కీలకమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. బెంగాల్ లో చివరి విడత ఎన్నికలు ముగియడంతో దేశంలోని పాపులర్ టీవీ చానెళ్లు, వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి. విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో హోరా హోరీ పోరులో ఫలితం ఎటైనా మారేలా ఉంది. బెంగాల్ ఎన్నికలలో కేంద్రంలోని బీజేపీతో టిఎంసి అధినేత మమతా బెనర్జీ తీవ్ర పోరాటం చేశారు. తాజా ఎగ్జిట్ పోల్స్‌లో రిపబ్లిక్ […]

Written By: NARESH, Updated On : April 29, 2021 8:57 pm
Follow us on

దేశంలోని కీలకమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. బెంగాల్ లో చివరి విడత ఎన్నికలు ముగియడంతో దేశంలోని పాపులర్ టీవీ చానెళ్లు, వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి. విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో హోరా హోరీ పోరులో ఫలితం ఎటైనా మారేలా ఉంది. బెంగాల్ ఎన్నికలలో కేంద్రంలోని బీజేపీతో టిఎంసి అధినేత మమతా బెనర్జీ తీవ్ర పోరాటం చేశారు. తాజా ఎగ్జిట్ పోల్స్‌లో రిపబ్లిక్ టీవీ-సిఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ లో మాత్రమే బెంగాల్‌లో బిజెపి అధికారాన్ని సాధిస్తుందని తెలిపాయి. మోడీ పార్టీ ఈసారి మ్యాజిక్ ఫిగర్ అందుకుంటుందని తెలిపింది. అయితే మిగతా సర్వే సంస్థలు మాత్రం బెంగాల్ లో మమతా బెనర్జీదే విజయం అని.. బీజేపీ రెండో స్థానంలోకి జారుకుంటుందని తెలిపాయి.

బెంగాల్ లోని మొత్తం 292 అసెంబ్లీ సీట్లలో బీజేపీకి 138-148 సీట్లు లభిస్తాయని రిపబ్లిక్ టివి అంచనా వేసింది. టిఎంసి ఈసారి 128-138 సీట్లు మాత్రమే సాధిస్తుందని తెలిపింది. ఇక కాంగ్రెస్- వామపక్షాలకు 11-21 సీట్లు లభిస్తాయి. కానీ బిజెపికి మద్దతు ఇచ్చే రిపబ్లికన్ పార్టీ ఎగ్జిట్ పోల్స్ ను జనాలు నమ్మే పరిస్థితి లేదని విశ్లేషకులు అంటున్నారు. రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ మినహా, మిగతా అన్ని ఏజెన్సీలు మరియు సర్వేలు సంస్థలన్నీ మమతా బెనర్జీకి బెంగాల్ లో విజయం తథ్యమని అంచనా వేస్తున్నాయి.

ఇక తమిళనాడులో డీఎంకే.. కేరళలో లెఫ్ట్ పార్టీకి, అసోంలో బీజేపీకి, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్టీఏ కూటమి విజయం సాధిస్తాయని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి.

+ పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు: (292 అసెంబ్లీ సీట్లు)

-ఈటీజీ సర్వే సంస్థ
టిఎంసి -164-176
బిజెపి -105-115
కాంగ్రెస్-వామపక్ష కూటమి -10-15

– పి-మార్క్
టిఎంసి -152-172
బిజెపి -112-132
కాంగ్రెస్-వామపక్ష కూటమి -10-20

-ఎబిపి + సి-ఓటర్
టిఎంసి: 152-164
బిజెపి: 109-121
కాంగ్రెస్-వామపక్ష కూటమి: 14-25

– సిఎన్ఎన్ +న్యూస్ 18
టిఎంసి -162
బిజెపి -115
కాంగ్రెస్-వామపక్ష కూటమి -15

– రిపబ్లిక్ టీవీ-సిఎన్ఎక్స్
టిఎంసి -128-138
బిజెపి -138-148
కాంగ్రెస్-వామపక్ష కూటమి -11-21

+ తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
తమిళనాలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి మేజిక్ సంఖ్య 118గా ఉంది.

– రిపబ్లిక్ టీవీ-సిఎన్ఎక్స్
ఏఐడీఎంకే కూటమి: 58-68
డిఎంకె కూటమి: 160-170
ఏఎంఎంకే కూటమి: 4-6

-పి-మార్క్
ఏఐడీఎంకే కూటమి: 40-65
డిఎంకె కూటమి: 165-190
ఏఎంఎంకే కూటమి: 1-3

-కేరళ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
140 మంది అసెంబ్లీ స్థానాలున్న కేరళలో మెజారిటీ మార్క్ 72.

-ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా
ఎల్‌డిఎఫ్: 104-120
యుడిఎఫ్: 20-36
ఎన్డీఏ: 0-2

– రిపబ్లిక్-సిఎన్ఎక్స్
ఎల్‌డిఎఫ్: 72-80
యుడిఎఫ్: 58-64
ఎన్డీఏ: 1-5

-అస్సాం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
126 మంది సభ్యులున్న అస్సాం అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 64.

-ఎబిపి-సి ఓటరు
ఎన్డీఏ: 58-71
కాంగ్రెస్ +: 53-66
ఇతరులు: 0-5

* పి-మార్క్
బిజెపి కూటమి -62-70
కాంగ్ కూటమి -56-64
ఇతరులు -0-4

* ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా
బిజెపి కూటమి -75-85
కాంగ్ కూటమి -40-50
ఇతరులు -1-4

*రిపబ్లిక్ టీవీ-సిఎన్ఎక్స్
బిజెపి కూటమి -74-84
కాంగ్ కూటమి -40-50
ఇతరులు -1-3

+ పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 సీట్లు మేజిక్ మార్క్ 16

-ఏబీపీ సీఓటర్ సర్వే
ఎన్డీఏ 19-23
యూపీఏ 7-11

-టైమ్స్ నౌ సీఓటర్
ఎన్డీఏ 18
యూపీఏ 12

– రిపబ్లిక్ సీఎన్ఎక్స్
ఎన్డీఏ 16-20
ఎన్డీఏ 11-13
ఇతరులు 0

– ఏబీపీ సీ ఓటరు
ఎన్డీఏ : 19-23
ఎస్.డీ.ఏ: 6-10
ఇతరులు: 1-2