Prostitution: వారు ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదురుగానే వ్యభిచారం మొదలుపెట్టారు. పోలీస్ స్టేషన్ అయితే ఎవరికి అనుమానం రాదని భావించి ఇలా చేశారని తెలుస్తోంది. కానీ పోలీసులు కూడా కొన్నాళ్లు పట్టించుకోలేదు. ఏదో ప్రైవేటు గెస్ట్ హౌస్ కావడంతో ఏవో సమావేశాలు నిర్వహించుకుంటారని అనుకున్నారు. కానీ లోపల మాత్రం అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో పలువురు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు అవుతోంది.

గ్వాలియర్ లోని పడవా పోలీస్ స్టేషన్ ముందు పాఠఖ్ పేరుతో ఓ గెస్ట్ హౌస్ ఉంది. అందులో మీటింగులు, పార్టీలకు అద్దెకు ఇస్తున్నారు. దీంతో ఎవరికి అనుమానం రాలేదు. కానీ లోపల మాత్రం అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ దందాపై పలుమార్లు ఫిర్యాదు చేయడంతో ఓ పోలీస్ అధికారి మఫ్టీలో వెళ్లి తనకు అమ్మాయి కావాలని అడిగాడు.
దీంతో గెస్ట్ హౌస్ మేనేజర్ ఇక్కడ అలాంటివి దొరకవని చెప్పాడు. కానీ పోలీస్ అధికారి తాను చాలా దూరం నుంచి వచ్చానని తెలపడంతో వెయ్యి నుంచి ఐదు వేల వరకు రేట్లు ఉంటాయని అమ్మాయిలను పిలిపించాడు. దీంతో ఆ పోలీస్ అధికారి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అమ్మాయిలను మేనేజర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఓనర్ మాత్రం పరారయ్యాడు.
Also Read: Luxury Naxalites: నక్సల్స్ వద్ద అంత ఖరీదైన కారా?..ఆశ్చర్యపోయిన పోలీసులు..
గెస్ట్ హౌస్ రైడ్ చేసి వ్యభిచారం ముఠా రట్టు చేయడంతో కండోమ్ లు, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వ్యభిచారంలో వచ్చిన డబ్బును సగం అమ్మాయిలకు మిగతా సగం ఓనర్ కు చేరుతుంది. మొత్తానికి సెక్స్ రాకెట్ దొరకడంతో అందరు ఆశ్చర్యపోయారు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే వ్యభిచారం నిర్వహించడం పోలీసులకు సవాలుగా మారింది.
Also Read: Rajasthan Woman: బాయ్ ఫ్రెండ్ కోసం పాకిస్తాన్ వెళ్లాలనుకున్న రాజస్థాన్ వివాహిత అంత పనిచేసింది?