Rejects Arvind Kejriwal Proposal To Visit Singapore: విదేశాల్లో జరిగే సదస్సులు, సమావేశాలకు మన దేశంలోని ముఖ్యమంత్రులు, మంత్రులు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లకు ఆహ్వానాలు అందుతుంటాయి. ఆహ్వానం అందగానే వెళ్లొచ్చా.. అంటే అలా కుదరదు. వాళ్లే పిచిచారు కదా.. నేను వెళ్తా అంటే కుదరదు. ఎవరు ఆహ్వానించిన అక్కడికి వెళ్లాలంటే ముందుగా కేంద్రం అనుమతి తప్పనిసరి. సీఎంలు కూడా కేంద్రానికి దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాల్సిందే. అనుమతి ఇస్తేనే వెళ్లాలి.
సింగపూర్ వెళ్లేందుకు సీఎంకు అనుమతి ఇవ్వకుండా..
సింగపూర్‌లో ఈనెలాఖరున ప్రపంచ నగరాల శిఖరాగ్ర సదస్సు(వరల్డ్ సిటీ సమ్మిట్) జరుగనుంది. ఈ సదస్సుకు రావాలని సింగపూర్ ప్రభుత్వం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఆహ్వానించింది. ఈమేరకు ఆదేశ ప్రభుత్వం తరఫున ఆహ్నాం పంపించారు. ఇందుకు సుముఖత వ్యక్తం చేసిన సీఎం కేజ్రీవాల్ సింగపూర్ వెళ్లేందుకు నెల క్రితం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ సమావేశానికి గడువు సమీపిస్తున్నా కేంద్రం అనుమతి ఇవ్వడం లేదు.
Also Read: MP Raghu Rama Krishnam Raju: పార్లమెంట్ లో రఘురామ కితకితలు
ఎవరు అనుమతించాలి…
విదేశాల్లో జరిగే సదస్సులకు వెళ్లేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, హోంశాఖకు దరఖాస్తు చేసుకోవాలి. విదేశీ వ్యవహారాల శాఖ దానిని పరిశీలించి అక్కడి రాయబారితో సమావేశం ఉద్దేశం, అందులో చర్చించే అంశాలు, ఆ సమావేశానికి హాజరయ్యే దేశాల ప్రతినిధులు, వారి హోదా తదితర వివరాలు సేకరిస్తుంది. ఇక కేంద్ర హోం శాఖ సదస్సు జరిగే ప్రాంతం అక్కడ భద్రత వ్యవహారాలు, ఆదేంతో ప్రస్తుతం ఉన్న సంబంధాలు, అక్కడికి వచ్చేవారికి కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలు తెలుసుకుంటుంది. అన్నీ సరిగా ఉన్నాయనుకున్న తర్వాతనే అ దరఖాస్తును పీఎంవోకు పంపించి అనుమతి ఇస్తుంది.
వివిధ కారణాలతో గతంలో అనుమతివ్వని కేంద్రం..
కేంద్రం సీఎంలు విదేశీ సదస్సులకు వెళ్లడానికి అనుమతి నిరాకరించడం ఇది మొదటిసారేం కాదు. గతంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రోమ్ వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. కేంద్రం మాత్రం అనుమతి నిరాకరించింది. అక్కడ జరిగే సదస్సుకు ముఖ్యమంత్రిస్థాయి వ్యక్తి అవసరం లేదని పేర్కొంది. తర్వాత కేరళ మంత్రి చైనా పర్యటనకు టూరిసం సదస్సులో పాల్గొనేందుఉ అర్జీ పెట్టుటకున్నారు. దీనిని కూడా కేంద్రం తిరస్కరించింది. అక్కడ భద్రత కారణాలతోపాటుట ఆ సదస్సుకు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్‌స్థాయి వ్యక్తి సరిపోతాడని తెలిపింది.
ఢిల్లీ సీఎంకూ అనుమతి లేనట్లే..
తాజాగా సింగపూర్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నెల క్రితమే అక్కడికి వెళ్లేందుకు నెల క్రితమే దరఖాస్తు చేసుకున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే అనుమతి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. నగరాల సదస్సుకు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్లడం అవసరం లేదని విదేశీ వ్యవహారాల శాఖ భావిస్తున్నట్లు తెలిసింది. ఢిల్లీ కార్పొరేషన్ చైర్మన్ వెళితతే సరిపోతుందని పీఎంవోకు సిఫారసు చేసినట్లు సమాచారం. అయితే ఇప్పుడు దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సింగపూర్‌తో మన దేశానికి మంచి సంబంధాలే ఉన్నాయి. మరోవైపు ఢిల్లీ నగరం లాంటి రాష్ట్రం, సింగపూర్ కూడా నగరం లాంటి దేశమే. ఈ నేపథ్యంలోనే సదస్సుకు అక్కడి ప్రభుత్వమే ఆహ్వానం పంపింది. అయినా కేంద్రం అనుమతి ఇవ్వడంలో జాప్యం చేయడం, నిరాకరించింది అన్న వార్తలు వస్తుండడంతో విపక్ష ప్రభుత్వాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. దేశ భద్రతత దృష్టా అనుమతి నిబంధనలు మంచిదే అయినా అకారణంగా, రాజకీయ లబ్ధి కోసం కేంద్రం అనుమతులు ఇవ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read:Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో వైసీపీ.. రిస్కు వెనుక రీజన్ ఇదే…