
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారు. దీంతో ఇప్పటికే బీజేపీ నేతల నుంచి కీలక సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ చేరిక ఖాయమైనట్లు తెలుస్తోంది. బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటి ప్రభుత్వంలో వణుకు పుట్టించింది. ఇన్నాళ్లు ఊరిస్తు వచ్చిన ఈటల వ్యవహారంలో పలు అనుమానాలు వ్యక్తమైనా చివరికి ఆయన బీజేపీలో చేరేందుకే నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈటల చేరికతో బీజేపీ ప్రతిష్ట మరింత పె రిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ నేతలు సైతం ఈటల చేరికకు ఉత్సాహం చూపినట్లు సమాచారం. మొత్తానికి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ లో బహిష్కరణకు గుైన నాటి నుంచి అనేక రకాల ప్రచారాలు వినిపించాయి. ఒక దశలో సొంత పార్టీ పెడతారనే ప్రచారం చోటుచేసుకుంది.
ఈటల రాజేందర్ చేరికతో బీజేపీ వైభవం పెరగనుంది. హుజురాబాద్ ప్రాంతంలో పట్టున్న నేతగా ఈటల రాజేందర్ రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపనున్నారని తెలుస్తోంది. దీంతో ఇటు కార్యకర్తలు, నాయకుల్లో సమీకరణలు మారుతున్నాయి. ఈటల చేరికతో ఆ ప్రాంతం నుంచి ఎక్కువ మంది బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. దీంతో పార్టీ రాబోయే ఎన్నికల్లో ఓటు బ్యాంకును పెంచుకుని ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.